Krithi Shetty: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ ఎక్కువ కాలం పాటు ముందుకు సాగదనేది వాస్తవం. ఎందుకంటే వాళ్లు కంటిన్యూస్ గా సక్సెస్ ఫుల్ సినిమాలను చేస్తూనే ఉండాలి. అలాగే నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ వాళ్ళ అందాన్ని కాపాడుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్లు హీరోయిన్లను ఎక్కువ సంవత్సరాలపాటు గుర్తుంచుకుంటారు. తద్వారా హీరోయిన్ల కెరియర్ కూడా చాలా సంవత్సరాల పాటు కొనసాగడానికి అవకాశం ఉంటుంది…ఇక ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో త్రిష, నయనతార లాంటి హీరోయిన్లు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ లో తమ మనుగడను కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఎలాంటి క్యారెక్టర్లు చేస్తే ప్రేక్షకులు మనల్ని ఆదరిస్తారు. అనే విషయాల పట్ల అవగాహన ను తెచ్చుకొని ఆ సినిమాలను సక్సెస్ ఫుల్ గా నిలుపడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు…
‘ఉప్పెన’ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న కృతి శెట్టి సైతం ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా వెలుగుతుందని చాలామంది అనుకున్నారు. కానీ ఆ ఒక్క సక్సెస్ ను మినహాయిస్తే ఆమె చేసిన ఏ సినిమా కూడా అంత పెద్ద సక్సెస్ ని సాధించకపోవడంతో ఆమె కెరియర్ అనేది డైలమాలో పడిపోయింది… స్టార్ హీరోలతో సినిమాలను చేసిన కూడా ఆమెకి కలిసి రావడం లేదు. ఇక ఈ ముద్దుగుమ్మ ఎందుకని వెనుకబడిపోతోంది.
ఇక సినిమాల సెలక్షన్లో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉందని మొదటి నుంచి చాలామంది సినిమా విమర్శకులు సైతం ఆమెను హెచ్చరిస్తున్నారు. అయినప్పటికి తను సినిమా కథలను వింటుందా? లేదా అనే విషయం తెలీదు కానీ వరుసగా సినిమాల మీద సినిమాలను చేస్తోంది. ఇప్పుడు కార్తీ హీరోగా వస్తున్న ‘అన్నగారు వస్తున్నారు’ అనే సినిమాలో సైతం హీరోయిన్ గా చేసింది. అయితే ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అవ్వాల్సింది.
కానీ అనుకోని కారణాలవల్ల పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికైతే ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే తప్ప ఆమె కెరీర్ ఇండస్ట్రీలో ఎక్కువ కాలంపాటు కొనసాగదు. ఒకవేళ ఈ సినిమా కనక డిజాస్టర్ అయితే ఆమెకు అవకాశాలను ఇచ్చేవారు సైతం కనుమరుగైపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…