NTR And Allu Arjun: పాన్ ఇండియాలో సత్తా చాటుతున్న తెలుగు హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. దేవర సినిమాతో పాన్ ఇండియాలోకి సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చడం ఆ సినిమా సాధించిన సక్సెస్ తో ప్రేక్షకులందరిలో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేశాడు. ఇక అప్పటినుంచి ఆయన పాన్ ఇండియా సినిమా చేయడానికి కసరత్తులైతే చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘డ్రాగన్’ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ఇదే సమయంలో అల్లు అర్జున్ సైతం పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో ఎంట్రీ ఇచ్చాడు. ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. అయితే అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే… ఇక ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా రాబోతుందంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు వీళ్ళ కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా రాలేదు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే రామ్ చరణ్, హృతిక్ రోషన్లతో మల్టీ స్టారర్ సినిమాలు చేశాడు. ఇప్పుడు అల్లు అర్జున్ తో చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ ని స్క్రీన్ మీద చూపించగలిగే కెపాసిటి ఉన్న దర్శకుడు ఎవరు అనే దానిమీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
విక్రమ్ సినిమాతో పాన్ ఇండియాలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న లోకేష్ కనక రాజ్ రీసెంట్ గా అల్లు అర్జున్ కి కథనైతే వినిపించాడు. ఇక అందులో మరొక హీరోకి అవకాశం ఉంది. కాబట్టి అది కూడా చాలా పెద్ద పాత్ర అవ్వడంతో లోకేష్ కనక రాజ్ ఎన్టీఆర్ అయితే బాగుంటాడని అనుకుంటున్నాడట.
తొందర్లోనే ఎన్టీఆర్ ను కలిసి తనకు కూడా కథను వినిపించే ప్రయత్నం చేస్తారట…ప్రస్తుతం డ్రాగన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్నా ఎన్టీఆర్ ని కలవడానికి మరి కొద్ది రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రను చేస్తే అల్లు అర్జున్ సైతం ఈ సినిమా చేస్తానని లోకేష్ తో చెప్పారట. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ను ఒప్పించడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…