mood of the nation survey : ఇండియా టుడే నిర్వహించిన “మూడ్ ఆఫ్ ది నేషన్” సర్వే దేశ రాజకీయ పరిస్థితులపై ప్రజల తాజా అభిప్రాయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ సర్వేలో కేంద్ర ప్రభుత్వ పనితీరు, ప్రధానమంత్రి నాయకత్వం, అలాగే రాబోయే ఎన్నికలపై ప్రజల మనోగతం ప్రతిబింబించింది. అధిక శాతం మంది ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతు వ్యక్తం చేయగా, ప్రతిపక్షాలపై మిశ్రమ స్పందన కనిపించింది.
ఎన్డీఏ కూటమికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో 352 స్థానాలు వస్తాయని ఇండియా టుడే అంచనా వేసింది. ఇండియా కూటమి 182 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. బిజెపికి 41 శాతం అంటే దాదాపు 287 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి 20% అంటే దాదాపు 80 సీట్లు వస్తాయని.. మిగతా పార్టీలకు 39 శాతం ఓట్లు, సీట్లు లభిస్తాయని ఇండియా టుడే అంచనా వేసింది.
యువతలో అభివృద్ధి, ఉపాధి అంశాలపై ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు సర్వే వెల్లడించింది. మొత్తంగా ఈ ఫలితాలు దేశ రాజకీయ దిశపై ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.