Overweight Problem: ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్నది బరువు సమస్య. ఆహార పదార్థాల్లో కల్తీ.. వాతావరణంలో మార్పుల కారణంగా కొంతమంది చిన్న వయసులోని బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రత్యేకంగా ఆహార పదార్థాలు తీసుకుంటున్నా.. దీని నుంచి బయటపడడం లేదు. అయితే వారిలో ప్రత్యేక సమస్యలు ఉండడంవల్లే బరువు పెరిగే అవకాశం ఉందని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటివారు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్త పడాలని అంటున్నారు. ఎటువంటి ఆహారం తీసుకుంటే శక్తితో పాటు బరువు పెరగకుండా ఉంటారు? మీరు ఎటువంటి డైట్ పాటించాల్సి ఉంటుంది? అసలు వీరిలో ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి?
బరువు పెరగడం, తగ్గడం అనేది మనం ఎంత ఆహారం తింటున్నాం? అనే దానిపై కాకుండా.. శరీరానికి ఎంత అవసరమో అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఒక్కోసారి మనం తీసుకునే ఆహారం ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా కూడా ఖర్చయ్య అవకాశం ఉంటుంది. దీనినే బేసిల్ మెటబాలిక్ రేట్ అని అంటారు. శ్వాస తీసుకోవడం,, రక్త ప్రసరణ, మెదడు పనిచేయడం వంటి ప్రాథమిక క్రియల కోసం శరీరానికి శక్తి అవసరం. ఈ శక్తి కోసం ఆహారం అవసరం ఏర్పడుతుంది. దీంతో మనం తీసుకునే ఆహారంలో సుమారు 60 నుంచి 70% దీనికి వినియోగం అవుతుంది. దీంతో ఒక్కసారి మనం తినే ఆహారపై కాకుండా శరీరంలో ఉండే మార్పుల వల్ల బరువు సమస్యల్లో తేడాలు ఉంటాయి.
కొంతమంది తక్కువగా ఆహారం తీసుకుంటున్నా.. అత్యధిక బరువు సమస్యలు ఎదుర్కొంటారు. వీరిలో లింగం, జన్యుపరమైన మార్పులు కూడా కావచ్చు అని కొంతమంది వైద్యులు తెలుపుతున్నారు. వీరి శరీరంలో ఉండే ప్రత్యేక లక్షణాలు, శరీర నిర్మాణం వంటి అంశాలు బరువు పెరిగేందుకు ఆస్కారం ఉంటుందని తెలుపుతున్నారు. ముఖ్యంగా కండరాల పరిమాణం ఎక్కువగా ఉన్నవారు ఆహారంతో పని లేకుండా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కండరాలు విశ్రాంతి తీసుకునే సమయంలో క్యాలరీల శక్తి ఖర్చు అయినా కూడా.. బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
నిద్రలేమి సమస్యతో కూడా బరువు పెరుగుతారు. నిద్రలేమి సమస్యల వల్ల ఆకలిని పెంచే హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. దీంతో పరిమితికి నుంచి ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. ఫలితంగా దీర్ఘకాలిక స్ట్రెస్ వల్ల కార్డిసోల్ ఆర్మూర్ల స్థాయిలు పెరిగి కొవ్వు పేరుకు పోవడానికి కారణం అవుతుంది. థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నవారు హార్మోన్లలో అసమధూల్యత ఏర్పాటు చేస్తుంది. దీంతో ఇలాంటి వారిలో మెటబాలిజం దెబ్బతింటుంది. ఫలితంగా బరువు నియంత్రణ ఉండకపోవచ్చు.
అయితే తక్కువగా ఆహారం తీసుకుంటున్నా.. బరువు పెరుగుతున్న వారు కేవలం డైట్ కే కాకుండా సరైన నిద్ర పోవాల్సిన అవసరం ఉంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు డైట్ పాటిస్తూనే మరోవైపు మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ఇలా ఉండడంవల్ల శరీరంలోని హార్మోన్లు సమతుల్యంగా ఏర్పడి ఆరోగ్య సమస్యలపై ప్రభావం చూపకుండా ఉంటాయి.