Vaishnav Tej and Krithi Shetty: ‘ఉప్పెన’ చిత్రంతో హిట్ జంటగా క్రేజ్ తెచ్చుకున్నారు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ జంటకు ఫుల్ డిమాండ్ ఉంది. చేసింది ఒక్క సినిమానే అయినా, ఆ సినిమాతో భారీ స్టార్ డమ్ రావడం.. ఈ జంటకు బాగా కలిసి వచ్చింది. అందుకే, ఈ జంట కోసం మేకర్స్ కూడా పోటీ పడుతున్నారు. ఒక్క సినిమాల పరంగానే కాకుండా.. కమర్షియల్ యాడ్స్ పరంగా కూడా ఈ జంటకు బాగా గిట్టుబాటు అవుతుంది.

బ్రాండ్స్, షాప్ ఓపెనింగ్ వంటి ఆఫర్లు వీరికి ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా ఈ జంట వైజాగ్ లో ఒక మాల్ ఓపెనింగ్ చేసింది. నిజానికి ఆ మాల్ ఓపెనింగ్ కి స్టార్ హీరోయిన్ని పిలవాలనుకున్నారు. అయితే, ‘వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి’ లకు యూత్ లో ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని, ఆ మాల్ యాజమాన్యం వీరిద్దరినీ ప్రత్యేకంగా ఆహ్వానించింది.
పైగా భారీ రెమ్యునరేషన్ ను కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. సహజంగా యంగ్ హీరోలకు భారీ పారితోషికం ఇచ్చి.. మాల్స్ ను ఓపెన్ చేయించరు. కానీ, వైష్ణవ్ తేజ్ మాత్రం ఆ విషయంలో లక్కీనే. అయితే, ఈ మాల్ ఓపెన్ చేసినందుకు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఇద్దరిలో ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంది మాత్రం కృతి శెట్టినే.
కృతి శెట్టి సాధారణంగా ఇలాంటి ఈవెంట్ కి ముప్పై లక్షల వరకు తీసుకుంటుంది. అయితే, ఈ మాల్ ఓపెనింగ్ కి మాత్రం నలభై వరకు తీసుకుందని టాక్. మొత్తానికి వైష్ణవ్ తేజ్, కృతి శెట్టికి హిట్ పెయిర్ గా బాగా డిమాండ్ క్రియేట్ అయింది. అందుకే, ఈ జంటని పెట్టుకుని ఓ లవ్ స్టోరీ చేయాలని దర్శకుడు విరించి వర్మ ప్రయత్నాలు చేస్తున్నాడు.
కాకపోతే వైష్ణవ్ తేజ్ ఇప్పటికే రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. అలాగే కృతి శెట్టి చేతిలో కూడా నాలుగు సినిమాలు ఉన్నాయి. కాబట్టి.. ముందు ఒప్పుకున్న సినిమాలు పూర్తి అయ్యాకే.. వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తోంది.