ఈ రోజుల్లో సినిమా హిట్ అవ్వడం అనేది గొప్ప విజయంగా మరిపోయింది సినిమావాళ్లకు. అందుకే ఏదైనా సినిమా హిట్ అయిందంటే, ఇక వెంటనే ఆ సినిమా తీసిన దర్శకుడు రేంజ్ ఓవర్ నైట్ లోనే మారిపోతుంది. అలాగే ఆ సినిమాలో నటించిన నటీనటులకు పొలోమంటూ ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయి. వరుస అడ్వాన్స్ లతో ఫుల్ కాల్షీట్స్ తో క్షణం తీరిక లేకుండా ఛాన్స్ లు వస్తాయి.
అందుకే సినిమా ఇండస్ట్రీలో ఒక్క సక్సెస్ వస్తే చాలు, ముందు లైఫ్ సెట్ అయిపోతుంది అనుకుంటూ ఉంటారు మేకర్స్. దానికి తగ్గట్టుగానే ఒక్క సినిమాతోనే కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటూ సెటిల్ అయిపోతున్నారు. ఉదాహరణకు ‘ఉప్పెన’ సినిమానే తీసుకుందాం. ఆ సినిమాలో హీరోయిన్ గా పరిచయమైన కృతి శెట్టికి ఇప్పుడు ఒక్కో సినిమాకు దాదాపు కోటి రూపాయిలు ఇస్తున్నారు.
చేసింది ఒక్క సినిమా, ఆ సినిమాకి పాజిటివ్ టాక్ రాగానే ఆమెకు వరుసగా రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇప్పటికే మూడు సినిమాల్లో ఆమె నటిస్తోంది. రెండో సినిమాకే కోటి రూపాయిలు తీసుకుని.. మూడో సినిమాకి కోటి పది లక్షలు తీసుకుని లైఫ్ లో ఆర్ధికంగా సెటిల్ అయిపోయింది. అయితే, అందరూ కృతి శెట్టిలానే సింగిల్ సినిమాకే లైఫ్ సెటిల్ అనే కాన్సెప్ట్ లు తగలవు.
ఈ విషయాన్ని మరో కొత్త బ్యూటీ రుజువు చేసింది. జాతి రత్నాలు అనే సినిమా ద్వారా పరిచయమైన యంగ్ బ్యూటీ ‘ఫరియా అబ్దుల్లా’. ఆ సినిమాలో ఆమె చాల బాగా నటించింది. మంచి నటి అని అనిపించుకుంది. అయినా ఆమెకు మాత్రం ఆఫర్లు రావడం లేదు. కొత్త సినిమా గురించి ఇంతవరకు ఒక్క స్టేట్ మెంట్ ఇవ్వలేకపోయింది ఫరియా.
ఫలానా సినిమాలో ఆమెను పరిశీలిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి,ఆమెకు అవకాశం ఇచ్చారు అని మాత్రం ఒక్క వార్త కూడా రావడం లేదు. పైగా ఫరియా అబ్దుల్లా మన హైదరాబాద్ అమ్మాయే. బహుశా అందుకే ఆమెకు ఛాన్స్ లు రావడం లేదేమో. లేకపోతే ఆమె చూడ్డానికి అందంగానే ఉంటుంది. పైగా ‘జాతిరత్నాలు’ సినిమాలో ‘చిట్టి’ అంటూ కుర్రాళ్ళ గుండెకి చిల్లు పెట్టింది. అయినా ఛాన్స్ లు రాకపోవడం విచిత్రం.