
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. కరోనా మహమ్మారితో రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. మరో వైపు మరణాలు రేటు కూడా పెరిగిపోతుంది. మరోవైపు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4,12,262 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 3,980 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,10,770401కు చేరుకుంది. దీంతో ఇప్పటి వరకు కరోనాతో 2,30,168 మంది మరణించారు. దేశంలో మొత్తం 35,66,398 యాక్టివ్ కేసులు ఉండగా 1,72,80,844 మంది కరోనా నుంచి కోలుకున్నారు.