Mahesh Babu: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. ఎందుకంటే వాళ్ళని చూసే ప్రేక్షకులు సినిమా థియేటర్ కి వస్తారు. ఆ సినిమా బాగుంటే సూపర్ సక్సెస్ చేస్తారు. లేకపోతే డిజాస్టర్ గా ముద్ర వేస్తారు. ఏది ఏమైనా కూడా ఆ సినిమా దర్శకుడు ఎవరు అనేది పక్కన పెడితే స్టార్ హీరోల మీదనే సినిమాలు నడుస్తున్నాయి అనేది ప్రతి ఒక్క స్టార్ హీరో వాదన… స్క్రీన్ మీద కనిపించేది వాళ్లే కాబట్టి వాళ్లకు మాత్రమే ఇక్కడ ఎక్కువ గుర్తింపైతే ఉంటుంది…
సూపర్ స్టార్ కృష్ణ (Krishna) నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు (Mahesh Babu) చాలా తక్కువ సమయంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. రాజకుమారుడు (Rajakumarudu) సినిమాతో ప్రిన్స్ గా తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్న మహేష్ బాబు ఆ తర్వాత చేసిన సినిమాలతో మంచి విజయాలను సాధించాడు. మురారి సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఆ తర్వాత వచ్చిన నాని సినిమా ప్లాప్ అవ్వాలని కృష్ణ కోరుకున్నాడట. కారణం ఏంటంటే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే మహేష్ ఇలాంటి జానర్ లలో సినిమాలు చేయడానికి మాత్రమే పనికొస్తాడని మాస్ హీరోగా మారే అవకాశాలు తక్కువగా ఉంటాయని కృష్ణ తన సన్నిహితుల దగ్గర ఈ సినిమా ప్లాప్ అవ్వాలని కోరుకున్నారట. ఇక తను అనుకున్నట్టుగానే నాని సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆ తర్వాత చేసిన ఒక్కడు, అతడు, పోకిరి లాంటి సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించి మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. నిజానికి నాని సినిమా ఎక్స్పరిమెంటల్ సినిమా…
ఈ మూవీలో మహేష్ బాబు చాలా వరకు గొప్ప నటనను ప్రదర్శించినప్పటికి సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది. ఇక ఆ తర్వాత కృష్ణ ఇచ్చిన ఇంటర్వ్యూలలో నాని సినిమా ఫ్లాప్ అవ్వడం వల్లే మహేష్ ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాడు. లేకపోతే మీడియం రేంజ్ హీరో గానే తన కెరీర్ ని లాగించుకుంటూ వచ్చేవాడని తను సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడిగా ఎదగడమే కాకుండా ప్రస్తుతం రాజమౌళితో సినిమాలు చేసి పాన్ వరల్డ్ లో కూడా తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే మహేష్ బాబు హాలీవుడ్ లో కూడా సినిమాలు చేసే అవకాశమైతే రావచ్చు.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను కూడా దక్కించుకుంటాడని యావత్ ఇండియన్ సినిమా అభిమానులంతా కోరుకుంటున్నారు…ఇక ఈ సినిమా 2027 లో రిలీజ్ కి రెడీ అవుతున్న నేపధ్యంలో అప్పటివరకు మహేష్ బాబు మరో సినిమాకి కమిట్ అయ్యే అవకాశాలైతే లేనట్టుగా తెలుస్తోంది…