Krishna Vamsi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్న దర్శకుడు కృష్ణవంశీ… కెరియర్ స్టార్టింగ్ లోనే ఆయన డిఫరెంట్ సినిమాలను చేసి ప్రేక్షకులను అలరించాడు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి దక్కనటువంటి క్రియేటివ్ డైరెక్టర్ అనే ఒక బిరుదును కూడా సంపాదించుకున్నాడు… ఇక అలాంటి కృష్ణవంశీ చేసిన మురారి సినిమా అప్పట్లో పెను ప్రభంజనాన్ని సృష్టించింది. అప్పటివరకు సరైన సక్సెసులు లేని మహేష్ బాబుకి ఒక సూపర్ సక్సెస్ ని సాధించి పెట్టడమే కాకుండా మహేష్ బాబు లోని నటన పరిణీతిని సైతం పెంచిన సినిమా ఇదే అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా కృష్ణవంశీ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రొడ్యూసర్ రామలింగేశ్వర రావు గారితో తనకి చిన్నపాటి క్రియేటివ్ డిఫరెన్స్ అయితే వచ్చాయి. దాంతో రామలింగేశ్వర రావు గారు ఆ సిచువేషన్ ని అర్థం చేసుకుని తను సెట్ లో ఉంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో తన బామ్మర్ది అయిన సుబ్బారావుకి సినిమాకు సంబంధించిన పూర్తి పనులు చూసుకోమని చెప్పాడట. దాంతో అప్పటి నుంచి ఆయన షూటింగ్ జరుగుతున్న సెట్ కి పెద్దగా వచ్చేవాడు కాదట… ఇలా ఈ సినిమాని కంప్లీట్ చేస్తున్న నేపథ్యంలో సినిమా లో చివరి సాంగ్ గా పెళ్లి పాట పెట్టడం మీద చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారట. మన సినిమాలో చివరి సాంగ్ మాస్ సాంగ్ గా ఉంటే ప్రేక్షకులను అరిస్తుందని సినిమా రేంజ్ కూడా మారుతుందని అందరు సలహాలు ఇచ్చారట.
ఈ విషయం కృష్ణ గారి దాకా వెళ్ళిందట. దాంతో కృష్ణవంశీ సైతం కృష్ణ ముందు ఒక క్లారిటి అయితే ఇచ్చాడట. మనం పెట్టబోయే పెళ్లి సాంగ్ రెండు మూడు దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని, మాస్ సాంగ్ అయితే ఎవరూ ఆదరిస్తారు. మన కాన్సెప్ట్ కూడా అది కాదు కాబట్టి కాన్సెప్ట్ బేస్డ్ గా వెళ్తేనే బెటర్ ఈ సినిమాలోని చివరగా వచ్చే పెళ్లి పాట మహేష్ బాబు కెరీర్ కి చాలా బాగా హెల్ప్ అవుతుందని కృష్ణవంశీ చెప్పారట.
దాంతో కృష్ణ కొంతవరకు సందిగ్ధ పరిస్థితిలో పడ్డప్పుడు కృష్ణవంశీ మాత్రం తన నిర్ణయంలో మార్పు ఉండదని చెప్పాడట. ఒకవేళ ఇది మహేష్ బాబు కెరియర్ కి కూడా చాలా కీలకమైన సినిమా అని మీరు భావించి మాస్ సాంగ్ ఉంటేనే బాగుంటుంది అని మీరు భావిస్తే మాత్రం నా ప్లేస్ లో వేరే డైరెక్టర్ ను పెట్టుకొని సినిమా చేయొచ్చు.
బట్ ఈ సినిమాకి డైరెక్టర్ గా నా పేరు కూడా నేను వేసుకోను అంటూ కృష్ణవంశీ చాలా ఆవేదనతో సమాధానమైతే ఇచ్చాడట. దాంతో కృష్ణ నిన్ను మార్చడం కరెక్ట్ కాదు ఏదైతే అది అయింది. నువ్వు అనుకున్నదే చెయ్ అంటూ కృష్ణవంశీకి సపోర్టుగా నిలిచారట. మొత్తానికైతే కృష్ణవంశీ ఆ సినిమాని అద్భుతంగా తెరకెక్కించి సక్సెస్ చేశాడు. సినిమా రిలీజ్ తర్వాత కృష్ణవంశీ కి విమర్శకుల నుంచి ప్రశంసలైతే దక్కాయి…