Car discount dates: కారు కొనాలని చాలామందికి ఉంటుంది. కానీ కొంతమంది డిజైన్ బాగుండాలని అనుకుంటారు. మరికొందరు ఫీచర్స్పై ఇంట్రెస్ట్ పెడతారు. ఇంకొందరు మైలేజ్ గురించి ఆలోచిస్తారు. అయితే అన్ని వర్గాల వారు మాత్రం ధర తక్కువ ఉన్న కారుపై దృష్టి పెడతారు. అయితే ప్రీమియం కార్లు కూడా తక్కువ ధరకు వచ్చే కొన్ని రోజులు ఉంటాయి. సాధారణంగా తక్కువ ధరకు కార్లు కొనాలని అనుకుంటే దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలో కొనాలని అనుకుంటారు. కానీ అందరికీ తెలియని సీక్రెట్ ఏంటంటే ఈ సమయంలో కంటే మరో మూడు తేదీల్లో కార్లు కొంటే భారీగా డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తేదీలు ఏవో తెలుసుకొని తక్కువ ధరకే కార్లు కొనుక్కోండి..
సెప్టెంబర్ 30:
ఈ రోజున ఎలాంటి పండుగ ఉండదు.. ప్రత్యేకమైన రోజు కాదు.. కానీ ఈ రోజున కారు కొనుగోలు చేస్తే భారీగా డిస్కౌంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక రంగం ప్రకారం సెప్టెంబర్ 30 వరకు సగం ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈ సమయంలో అప్పటివరకు తమ సేల్స్ ఎలా ఉన్నాయి? భవిష్యత్తులో ఎలా సేల్ చేయాలి? అన్నదానిపై చర్చ జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఒకవేళ టార్గెట్ రీచ్ కాకపోతే ఈ సమయంలో కార్ల పై డిస్కౌంట్ పెట్టి ఎక్కువగా అమ్మాలని చూస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు మిగిలిన కార్లు తర్వాతి ఆర్థిక సంవత్సరానికి భారంగా మారిపోతుంది. అందుకే కొత్తగా కారు కొనాలని.. తక్కువ ధరకే కొనాలని చూసేవారు సెప్టెంబర్ 30 లేదా అంతకంటే ముందు రోజుల్లో కొనుగోలు చేయడం మంచిది.
డిసెంబర్ 31:
సాధారణంగానే న్యూ ఇయర్ సందర్భంగా ఈ తేదీన కారు కొనాలని చూస్తారు. కానీ అసలు విషయం ఏంటంటే ఇప్పటివరకు కంపెనీలు తమ టార్గెట్ ను రీచ్ చేయాలని అనుకుంటాయి. ఎక్కువగా సేల్ కానీ కారు.. లేదా ఎక్కువగా విక్రయాలు జరుపుకునే కార్లపై డిస్కౌంట్లు ప్రకటించి తమ సేల్స్ ను పెంచుకుంటాయి. ఇదే సమయంలో భారీగా ఆఫర్లు కూడా ప్రకటిస్తాయి. ఎందుకంటే ఈ సంవత్సరంలో మిగిలిపోయిన ప్రోడక్ట్ తర్వాతి సంవత్సరంలో అది మ్యానుఫ్యాక్చర్ డేట్ మారుతుంది. దీంతో కొంతమంది పాత డేట్ తో ఉన్న కారు కొనడానికి ఆసక్తి చూపరు. ఈ సమయంలో కంపెనీలు భారీగా డిస్కౌంట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది.
జనవరి 1:
న్యూ ఇయర్స్ సందర్భంగా చాలామంది వినియోగదారులు ఈ తేదీన కారు కొనాలని అనుకుంటారు. అయితే డిసెంబర్ 31 వరకు సేల్స్ గాని కార్లు ఈ తేదీన భారీ ఆఫర్తో ప్రకటిస్తారు. ఈ రెండు కలవడం వల్ల కంపెనీలు తమ టార్గెట్ ను రీచ్ చేస్తుంటారు.
ఈ విధంగా ప్రత్యేకమైన తేదీల్లో కార్లు లేదా కొన్ని ముఖ్యమైన వస్తువులు కొంటే భారీగా డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ డిస్కౌంట్ లను కొన్ని కంపెనీలు బయట ప్రచారం చేయవు.. మాయా తేదీల్లో నేరుగా షోరూం లేదా సంస్థలకు వెళ్తే అసలు విషయం తెలుస్తుంది.