Kota Srinivasa Rao Wife Passes Away: ప్రతి నాయకుడిగా.. కీలక పాత్రధారిగా.. హాస్యాన్ని పండించే నటుడిగా.. అనేక పాత్రల్లో నటించి.. తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకున్న ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు సతీమణి కోటా రుక్మిణి ఇకలేరు. సోమవారం హైదరాబాదులో తన నివాసంలో సాయంత్రం ఆమె కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె ఆరోగ్యం బాగాలేదు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ.. సోమవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగు సినీ ప్రముఖులు కోట ఇంటికి వెళ్లి.. కోటా రుక్మిణి పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు.
కోట శ్రీనివాసరావు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ గత నెల 13న హైదరాబాదులో తన నివాసంలో కన్నుమూశారు. మూత్రపిండాల సమస్య, హృద్రోగంతో బాధపడుతూ జూలై 13న మరణించారు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక దిగ్గజ నటుడుని కోల్పోయింది. భర్త మరణం తర్వాత రుక్మిణి తీవ్ర శోకంలో మునిగిపోయారు. భర్త జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అదే బాధలో ఉండిపోయారు. కోటా శ్రీనివాసరావు చనిపోవడానికంటే ముందే రుక్మిణి పలమార్లు అనారోగ్యానికి గురయ్యారు. తన భార్యను కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో కోట శ్రీనివాసరావు ఆమెకు అత్యంత ఆధునికమైన వైద్యాన్ని అందించారు. ఫలితంగా ఆమె కోలుకున్నారు. భార్యను కాపాడుకోవాలని ఉద్దేశంతో కోటా శ్రీనివాసరావు తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా అనేక సమస్యలు ఆయనను ఇబ్బంది పెట్టాయి.
Also Read: కన్నప్ప ని కూడా అందుకోలేకపోయిన ‘వార్ 2’.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది పీడకల!
కోట శ్రీనివాసరావు చనిపోయిన తర్వాత రుక్మిణి ఆయన జ్ఞాపకాలలోని ఉండిపోయారు. ఇదే క్రమంలో అనారోగ్య సమస్యలు ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. కుటుంబ సభ్యులు ఆసుపత్రులలో చూపించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి సోమవారం సాయంత్రం హైదరాబాదులోని తన స్వగృహంలో రుక్మిణి కన్నుమూశారు. నెల వ్యవధిలోనే కోటా శ్రీనివాసరావు.. కోటా రుక్మిణి కన్నుమూయడంతో ఆ కుటుంబంలో తీవ్రమైన విషాదం నెలకొంది. రుక్మిణి శ్రీనివాసరావు దంపతులకు కుమార్తె, కుమారుడు. కుమారుడు 2010లో బాహ్య వలయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. అప్పటినుంచి రుక్మిణి అనారోగ్యానికి గురయ్యారు. కొడుకు జ్ఞాపకాలను మర్చిపోలేక ఆమె తల్లడిల్లిపోయేవారు. రుక్మిణి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు కోటా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి.. ఆమె పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు.