Kota Srinivasa Rao Wife Passed Away: అప్పటికి కోటా శ్రీనివాసరావు సినీ రంగంలోకి ప్రవేశించారు. రుక్మిణిని వివాహం చేసుకున్నారు. శ్రీనివాస రావు – రుక్మిణి దంపతులకు ఒక కుమారుడు కలిగాడు.. మలిసంతానంగా కుమార్తె పుట్టింది. తన అమ్మ మళ్ళీ పుట్టిందని శ్రీనివాసరావుకు విపరితమైన ఆనందం వేసింది. కుమార్తె పుట్టిన తర్వాత రుక్మిణి మతిస్థిమితాన్ని కోల్పోయింది.
Also Read: ‘రావు బహదూర్ ‘ సినిమా టీజర్ ఏంటి భయ్యా ఇలా ఉంది…రాజమౌళి ట్వీట్ సంగతేంటి..?
తన అర్ధాంగి మతిస్థిమితం కోల్పోవడంతో కోట శ్రీనివాసరావుకు కాళ్ళ కింద భూమి కంపించిపోయింది. సతీమణి అనారోగ్య పరిస్థితి చూసి ఆయన చలించిపోయారు. ఆమెను మామూలు మనిషిని చేయడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. అనేక ఆసుపత్రులలో చూపించారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఒక దశలో కోట శ్రీనివాసరావు బీజీ ఆర్టిస్టుగా మారిపోయారు. ఓవైపు సినిమాలలో నటిస్తూనే.. మరోవైపు తన భార్య అనారోగ్య పరిస్థితిని తలుచుకుని తీవ్రంగా ఇబ్బంది పడేవారు. అప్పట్లో ఓ సినిమా షూటింగ్ కు వేరే ప్రాంతానికి కోట వెళ్లాల్సి వచ్చింది. కొద్దిరోజులపాటు ఆ ప్రాంతంలో ఉండాల్సి వచ్చింది. షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత.. రుక్మిణి ఆయనను గుర్తుపట్టలేదు. అది కోటాకు తీవ్ర ఇబ్బంది కలిగించింది. భార్య తనను గుర్తుపట్టకపోవడం పట్ల కోటా తీవ్రంగా దుఃఖించారు. తన బాధను బాబూ మోహన్ తో చెప్పుకుంటూ విలపించారు.
చాలా సంవత్సరాల పాటు అనేక ఆసుపత్రులలో చికిత్స పొందిన తర్వాత రుక్మిణి మామూలు మనిషి అయ్యింది. అంతా సాఫీగా జరిగిపోతోంది అనుకుంటున్న క్రమంలో 2010లో కుమారుడు ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగిన ప్రమాదంలో మరణించడంతో రుక్మిణి మళ్లీ అనారోగ్యం బారిన పడింది. కొద్దిరోజులపాటు ఆసుపత్రికి పరిమితమైంది. అప్పుడు కూడా కోటా శ్రీనివాసరావు ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. చాలా రోజులపాటు ఆమెను కనిపెట్టుకొని ఉన్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్నప్పటికీ.. రుక్మిణి ఒకప్పటి మాదిరిగా ఉండలేకపోయారు. కొడుకు జ్ఞాపకాలను తలుచుకుంటూ పదేపదే విలపించేవారు. ఈ క్రమంలో అనేక పర్యాయాలు ఆమె అనారోగ్యం బారిన పడ్డారు. ఆమెను కాపాడుకునేందుకు చివరికి తన ఆరోగ్యాన్ని సైతం ఫణంగా పెట్టారు కోటా శ్రీనివాసరావు. తీవ్రమైన అనారోగ్య సమస్యతో ఆయన ఇటీవల కన్నుమూశారు. భర్త కనుముయడంతో రుక్మిణి బాధకు అంతంటూ లేకుండా పోయింది. చివరికి రుక్మిణి భర్త జ్ఞాపకాలతో కుమిలిపోతూ కన్నుమూసింది.