Kannappa vs War 2 Collections: రీసెంట్ గా విడుదల అవుతున్న కొన్ని సినిమాలకు ప్రేక్షకుల తీర్పు చాలా విచిత్రం గా ఉంటుంది. భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడమే కాకుండా, చిన్న హీరోల సినిమాలు రాబట్టినంత వసూళ్లను కూడా రాబట్టలేకపోతున్నాయి. ఇది నిజంగా ఆలోచించదగ్గ విషయమే. స్టార్ హీరో అంటే టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ రాబట్టే వాడు అని, అందుకే వాళ్ళు అడిగినంత రెమ్యూనరేషన్స్ ఇవ్వడానికి నిర్మాతలు ఏ మాత్రం వెనకాడకుండా ఇస్తుంటారు. కానీ ఇప్పుడు స్టార్ పవర్ ఏ హీరో కి కూడా పని చేయడం లేదు. కేవలం కంటెంట్ మాత్రమే రాజ్యం ఏలుతుంది. అందుకు ఉదాహరణగా రీసెంట్ గా విడుదలైన ఎన్టీఆర్(Junior NTR) ‘వార్ 2′(War 2 Movie), మంచు విష్ణు(Manchu Vishnu) ‘కన్నప్ప'(Kannappa Movie) చిత్రాలను తీసుకుందాం. ఎన్టీఆర్ పాన్ ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్, మంచు విష్ణు కి టాలీవుడ్ లో అసలు మార్కెట్ లేదు.
కానీ ‘కన్నప్ప’ చిత్రం ఏకంగా ‘వార్ 2’ ని డామినేట్ చేసింది అంటే నమ్ముతారా?, కానీ నమ్మాల్సిందే, ఎందుకంటే అది పచ్చి నిజం కాబట్టి. పూర్తి వివరాల్లోకి వెళ్తే మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రానికి మొదటి సోమవారం హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపుగా 34 లక్షల రూపాయలకు జరిగింది. కానీ ‘వార్ 2’ తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ కేవలం 20 లక్షల రూపాయలకు మాత్రమే జరిగింది. మంచు విష్ణు తన జీవిత కాలం లో ఎన్టీఆర్ పై ఆధిపత్యం సాధించిన సందర్భం ఇదే. ‘కన్నప్ప’ చిత్రం పై మొదట్లో ఎలాంటి అంచనాలు ఉండేవి కాదు. ఎందుకంటే మంచు కుటుంబం పై మొదటి నుండి విపరీతమైన నెగిటివ్ ఫీలింగ్ ఆడియన్స్ లో ఉంది కాబట్టి. కానీ సినిమా విడుదల అయ్యాక, అందరినీ ఈ చిత్రం సర్ప్రైజ్ కి గురి చేసింది.
ఇదేంటి ఈ చిత్రం ఇంత బాగుంది, అసలు ఊహించలేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేశారు. ఫలితంగా ఆ చిత్రానికి ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ‘వార్ 2’ చిత్రానికి ఇప్పటి వరకు తెలుగు వెర్షన్ లో 57 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కలిసి నటించిన సినిమానే జనాలు పట్టించుకోకుండా, అసలు మార్కెట్ లేని మంచు విష్ణు సినిమాని ఆదరించారంటేనే అర్థం చేసుకోవచ్చు, ఇది స్టార్ స్టేటస్ మీద సినిమాలు నడిచే రోజులు కావు, కేవలం కంటెంట్ మీద మాత్రమే సినిమాలు నడిచే రోజులు అని. అంతే కాదు నెల రోజుల క్రితం విడుదలైన ‘మహావతార్ నరసింహా’ లాంటి చిన్న చిత్రం కూడా కొత్త సినిమాలను డామినేట్ చేస్తూ ఇప్పటికీ హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకుంటుంది.