Devara 2 : జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ(koratala Shiva) దర్శకత్వంలో వచ్చిన దేవర (Devara) సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడంతో పాటు ఎన్టీఆర్ కెరియర్ లో 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కూడా సంపాదించి పెట్టింది. ఇక సోలో హీరోగా ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా చేయడం ఇదే మొదటిసారి… దాంతో పాన్ ఇండియాలో 500 కోట్ల మార్క్ ను టచ్ చేసిన హీరోగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించాడనే చెప్పాలి. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. దేవర సినిమాకి సిక్వెల్ గా దేవర 2 (Devara 2) సినిమాను కూడా తెరకెక్కించే పనిలో కొరటాల శివ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో మునిగిపోతున్న ఆయన తొందర్లోనే ఈ సినిమాని తెరకెక్కించాలని చూస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ అనే సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. కాబట్టి ఈ సినిమా పూర్తయిన వెంటనే దేవర 2 సినిమా ఉండబోతుందట.
దేవర వల్ల ప్రొడ్యూసర్లకి కూడా భారీగా లాభాలు అయితే వచ్చాయి. కాబట్టి ఈ సినిమాకి సీక్వెల్ ని తీసుకొచ్చి మరోసారి లాభాల బాట పట్టాలనే ఉద్దేశ్యం లో మేకర్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా తమ దైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలందరికి ఎన్టీఆర్ పోటీ ఇస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
ఇక తన తోటి హీరో అయిన అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పటికే పుష్ప 2 (Pushpa 2) సినిమాతో 1900 కోట్ల మార్కెట్ ను అందుకున్నాడు. మరి ఎన్టీఆర్ మాత్రం ఇంకా 500 కోట్ల దగ్గరే ఆగిపోయాడు. అందుకే ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాతో 2000 కోట్ల మార్కును టచ్ చేయాలని చూస్తున్నాడు. మరి దేవర 2 సినిమాని కూడా 2000 కోట్ల మార్కును టచ్ చేస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
ఇక మొదట్లో దేవర 2 సినిమా ఇప్పుడు అప్పుడే ఉండదని ప్రచారం చేసినప్పటికి 2026వ సంవత్సరంలోనే ‘దేవర 2’ సినిమాను పట్టాలెక్కించడానికి ఎన్టీఆర్ సన్నాహాలు చేసుకుంటున్నాడట…మరి ఏది ఏమైనా కూడా కొరటాల శివ ఎన్టీఆర్ కి మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… చూడాలి మరి ఇకమీదట కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఎంతటి వసూళ్లను రాబడుతుంది. తద్వారా ఎన్టీఆర్ కి ఎలాంటి గుర్తింపును తీసుకొస్తుందనేది కూడా తెలియాల్సి ఉంది…