Kollywood Actor Affair: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులందరూ సినిమాల్లో నటిస్తూ భారీ రెమ్యూనరేషన్లను తీసుకుంటూ లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తు ఉంటారు. అయితే ఇలాంటి క్రమంలోనే కొంతమందికి సక్సెస్ లు దక్కుతూ ఉంటే మరి కొంతమంది మాత్రం ఫెయిల్యూర్స్ ను చవిచూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది. అయితే ఇండస్ట్రీలో ఎవరు ఏ రోజు ఎలా ఉంటారో ఎవరికి అర్థం కావడం లేదు. కొంతమంది నటీనటులు పెళ్లి చేసుకున్న కొద్దిరోజుల్లోనే డివోర్స్ తీసుకొని ఎవరికి వారు సపరేట్ అయిపోతున్నారు. ఇక మరి కొంతమంది మాత్రం పిల్లలు పుట్టి వాళ్ళు పెద్ద వాళ్ళు అయ్యేంతవరకు కూడా కలిసిమెలిసి బతుకుతున్నారు. ఇక ఇంకొందరు మాత్రం భార్య, పిల్లలు ఉన్నా కూడా మరొకరితో ఎఫైర్ మైంటైన్ చేస్తూ చివరికి వాళ్ళ విషయం అందరికి తెలిసిన తర్వాత పెళ్ళి చేసుకుంటున్నారు. ఇలా ఇండస్ట్రీలో రకరకాల వార్తలు మనకు వినిపిస్తూనే వస్తున్నాయి. ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది అందువల్లే సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎవరికీ కనెక్ట్ అవుతారో ఎవరి నుంచి డిస్కనెక్ట్ అవుతారు అనేది కూడా చెప్ప లేకపోతున్నారు…ఇక ఇదిలా ఉంటే ప్రముఖ తమిళ నటుడు అయిన ‘మదంపట్టి రంగరాజ్’…ప్రస్తుతం తను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికే ఆయనకు భార్య ఇద్దరు మగ పిల్లలు ఉన్నప్పటికి ప్రముఖ స్టైలిస్ట్ ‘జాయ్ క్రిజిల్డా’ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే జాయ్ ఈ విషయాన్ని తన ఇన్స్టాలో తెలియాజేస్తూ వాళ్ళు పెళ్లి చేసుకున్న ఫోటోలను షేర్ చేసింది. నిజానికి వీళ్ళ మధ్య ఉన్న ఎఫైర్ గురించి ఇప్పటివరకు ఎలాంటి వార్తలైతే రాలేదు. సడన్ గా వీళ్ళిద్దరి మధ్య ఎఫైర్ ఉందని ఆమె ఆరు నెలల ప్రెగ్నెంట్ అనే విషయాలు తెలిశాయి. ఇక ఇద్దరూ కలిసి ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న రంగరాజు మొదటి భార్య అయిన శృతి రంగరాజ్ కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read: బాలయ్య బాబు అఖండ 2 రిలీజ్ పై ఎందుకంత సస్పెన్స్.. ఏం జరిగింది..?
ఆయన రెండోవ పెళ్లి చేసుకోవడం పట్ల ఆమె వాదన చేయడంతోనే వాళ్ల విషయం బయటికి వచ్చిందని మరి కొంతమంది చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రంగరాజు తనకు చక్కటి భార్య ఇద్దరు మగ పిల్లలు ఉన్నప్పటికి ఇలాంటి వ్యవహారాలను చేయడం పట్ల అతని మీద కొంతమంది అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు…
ఇక రంగరాజు చెఫ్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేశాడు. 1999లో ఒక రెస్టారెంట్ లో చెఫ్ మాస్టర్ గా వర్క్ చేశాడు. ఇక ఆ తర్వాత తన సొంత ఊరిలో క్యాటరింగ్ నిర్వహిస్తూ తన లైఫ్ స్టైల్ లో లీడ్ చేస్తూ వచ్చాడు. ఇక ప్రముఖ నటుడు అయిన కార్తీతో కలిసి ఆయన 400కు పైన పెళ్ళిళ్ళకు క్యాటరింగ్ చేశారు.
#MadhampattyRangaraj (@MadhampattyRR), a celebrated chef and the owner of one of South India’s most renowned catering companies, and #JoyCrizilda (@joy_stylist), a leading celebrity stylist, have officially announced their marriage addressing as Mr & Mrs Rangaraj. ✨ pic.twitter.com/qgMIIvzYxP
— Movies Singapore (@MoviesSingapore) July 26, 2025
ఇక వీటితోపాటు తను నటుడిగా వారి ‘మెహందీ సర్కస్’ లాంటి సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కానీ ఆయన ఇలాంటి పనులు చేయడం పట్ల చాలామంది అభిమానులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు…