Sandeep Reddy Vanga Interview Vijay Deverakonda: తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని శాసిస్తున్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vanga) ఒకరు… ఈయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం విశేషం…ప్రస్తుతం ఆయన దర్శకుడు గానే కాకుండా ఇంటర్వ్యూయార్ గా మారి రిలీజ్ కి రెడీ గా ఉన్న సినిమా హీరో, దర్శకులను ఇంటర్వ్యూ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇక ఇప్పటివరకు రిలీజ్ కి ముందు ఆయన ఇంటర్వ్యూ చేసిన అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయనే విషయం మనందరికీ తెలిసిందే. అందుకే అతను ఇప్పుడు లక్కీ ఛామ్ గా మారిపోయాడు అంటూ పలువురు సోషల్ మీడియాలో కామెంట్లైతే చేస్తున్నారు…
Also Read: బీజేపీ గుట్టు బయటపెడుతోన్న రాజాసింగ్
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ‘ త్రిబుల్ ఆర్’ సినిమా రిలీజ్ సమయంలో ఆయన రాజమౌళిని ఇంటర్వ్యూ చేశాడు. ఆ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత దేవర(Devara) సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో సందీప్ రెడ్డి వంగా ఎన్టీఆర్ ని ఇంటర్వ్యూ చేశాడు.
ఈ సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది.
ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘ కింగ్డమ్ ‘ సినిమా ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు అయిన గౌతమ్ తిన్ననూరి, హీరో అయిన విజయ్ దేవరకొండ లను ఇంటర్వ్యూ చేశాడు. మరి ఈ సినిమా కూడా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాబట్టి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా అనే దాని మీదనే కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తే మాత్రం సందీప్ వంగకి ఇంటర్వ్యూయార్ గా మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా అతన్ని సెంటిమెంట్ గా చాలామంది స్టార్ హీరోలు, దర్శకులు వాడుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం విశేషం… ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో ‘స్పిరిట్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను వీలైనంత తొందరగా సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు…