https://oktelugu.com/

Pushpa 2 The Rule KISSIK song : పుష్ప 2 ‘కిస్సిక్’ సాంగ్ వచ్చేసింది.. వింటేజ్ దేవి శ్రీ ప్రసాద్ మార్క్..అల్లు అర్జున్, శ్రీలీల డ్యాన్స్ కి మాటల్లేవ్!

ఈ ఈవెంట్ కి హీరో అల్లు అర్జున్, రష్మిక మందన తో పాటు, మూవీ టీం మొత్తం పాల్గొనింది. అదే విధంగా పుష్ప తమిళనాడు బయ్యర్స్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2024 / 08:42 PM IST

    Pushpa 2 The Rule, KISSIK Lyrical Video

    Follow us on

    Pushpa 2 The Rule KISSIK song : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ ఐటెం సాంగ్ కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే. మొన్న విడుదల చేసిన ప్రోమో వీడియో కే మెంటలెక్కిపోయారు. కచ్చితంగా ఈ పాట ‘పుష్ప 1’ చిత్రంలోని ఐటెం సాంగ్ ని మించి హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కాసేపటి క్రితమే ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. అంచనాలకు తగ్గట్టుగానే ఈ పాట అదిరిపోయింది. సాధారణంగా ఏ పాట అయినా విన్న మొదటి సారి నచ్చేయదు. ఒకటి రెండు సార్లు వింటేనే నచ్చుద్ది. కానీ ఈ పాట మాత్రం మొదటి సారి విన్నప్పుడే బాగా నచ్చేసింది. పాట మధ్యలో వచ్చే ‘దెబ్బలుపడుతాయ్ రో’ అనే లిరిక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట సోషల్ మీడియా లో సెన్సేషనల్ అయ్యి ఇంస్టాగ్రామ్ లో మిలియన్ల కొద్దీ రీల్స్ వచ్చే అవకాశం ఉంది.

    అయితే ఈ పాటలో ఉన్న ఏకైక అసంతృప్తి ఏమిటంటే డ్యాన్స్ మూవ్మెంట్స్ పెద్దగా చూపించకపోవడమే. కేవలం రెండు మూడు హుక్ స్టెప్పులు మాత్రమే చూపించారు. మిగతావి మొత్తం థియేటర్ లోనే చూడాల్సిందే. అయితే కనీసం ఈ పాటలోని ఒక్క నిమిషం ఫుటేజీ చూపించినా కచ్చితంగా అభిమానులు ఒక రేంజ్ లో సంతృప్తి చెందేవారు. కానీ సాంగ్ బీట్స్ మొత్తం చూస్తుంటే థియేటర్స్ లో అల్లు అర్జున్, శ్రీలీల వేసే డ్యాన్స్ స్టెప్పులకు థియేటర్ పై కప్పు ఎగిరిపోవడం గ్యారంటీ. ఆ రేంజ్ లో ఉంది. రీసెంట్ గా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం పై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆయన తన వింటేజ్ మార్క్ లో ఈ ఐటెం సాంగ్ ని కంపోజ్ చేసి తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. ఇప్పటికే ఈ సినిమాలో ఆయన కంపోజ్ చేసిన రెండు పాటలు విడుదలై యూట్యూబ్ లో వందల కొద్దీ మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది.

    ఇప్పుడు ఈ ‘కిస్సిక్’ పాట కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ స్టెప్పులు ఎక్కువగా రివీల్ చేసి ఉండుంటే, ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునేవారు ఇరగకుమ్మేసేవారు. కానీ ఇప్పటికీ ఉన్న హుక్ స్టెప్ చాలా బాగుంది. రీల్స్ మొదటి రెండు పాటలకు వచ్చిన రేంజ్ లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సాంగ్ లాంచ్ ని నేడు చెన్నై లో గ్రాండ్ గా ఈవెంట్ ని పెట్టి లాంచ్ చేసారు. ఈ ఈవెంట్ కి హీరో అల్లు అర్జున్, రష్మిక మందన తో పాటు, మూవీ టీం మొత్తం పాల్గొనింది. అదే విధంగా పుష్ప తమిళనాడు బయ్యర్స్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు.