హైదరాబాద్ జట్టును సొంతం చేసుకున్న నాటి నుంచి కావ్య తీరు ఇలాగే ఉంది. పైగా మైదానంలో కూడా కావ్య చిన్నపిల్లల మాదిరిగా సందడి చేస్తుంది కాబట్టి.. మీడియా విపరీతమైన ఎక్స్ పోజర్ ఇస్తుంది. అందువల్లే కావ్య కు అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఈసారి ఐపీఎల్ వేలంలో కావ్య సందడి చేసినప్పటికీ.. ఆమెను మించి ఒక మహిళ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.. అటు మీడియా, ఇటు సోషల్ మీడియా ఆమె నామస్మరణ చేసింది.. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె పేరు ఏంటి? ఆమె నేపథ్యం ఏంటంటే..
ఆమె పేరు మల్లిక
ఐపీఎల్ 2025 తొలి రోజు వేలం ఉత్సాహంగా సాగుతోంది. ఎడారి దేశం జెండా నగరం వేదికగా ఈ కార్యక్రమం నడుస్తోంది. పెద్దపెద్ద కార్పొరేట్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఒక మహిళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె పేరు మల్లికా సాగర్. ఆమె ఐపీఎల్ వేలం ప్రక్రియను నిర్వహిస్తున్నారు. మల్లిక స్వస్థలం ముంబై. ఆమె ఒక ఆర్ట్ కలెక్టర్. మన దేశానికి సంబంధించిన కళాకృతుల కన్సల్టెంట్ స్పెషలిస్ట్ గా ఆమె పనిచేస్తున్నారు. మల్లికా వయసు 49 సంవత్సరాలు. ఆమె తన కెరియర్ను క్రిస్టియన్స్ ఆక్షన్ హౌస్ వేలం నిర్వాహకురాలిగా ప్రారంభించారు. న్యూయార్క్ లో తొలిసారిగా మోడ్రన్ ఇండియన్ ఆర్ట్ వేలం నిర్వహించారు. 2001లో ఈ కార్యక్రమం జరిగింది. అయితే అప్పుడు భారత మూలాలు ఉన్న తొలి మహిళ ఆక్షనీర్ ఆమె కావడం ఒకసారిగా వార్తల్లోకి ఎక్కారు. ఆ తర్వాత తన కెరియర్ ను క్రమక్రమంగా డెవలప్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఆర్ట్ ఇండియా కన్సల్టెంట్ సంస్థ భాగస్వామిగా.. ముంబై మహానగరంలో అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆరుదైన కళాకృతులను వేలం వేసే ప్రక్రియలో పాల్గొన్నారు.
ఐపీఎల్ చరిత్రలో..
స్పోర్ట్స్ విభాగంలో మల్లిక వేలం ప్రక్రియలో పాల్గొనడం ఇది మొదటిసారి కాదు. 2021 ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో ఆమె వేలం ప్రక్రియను నిర్వహించి ప్రశంసలు దక్కించుకున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ వేలాన్ని కూడా ఆమే నిర్వహించారు. 2023లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి అభినందనలు అందుకున్నారు. ఇక అదే సంవత్సరం చివరిలో దుబాయ్ వేదికగా ఐపిఎల్ వేలం నిర్వహించారు. అప్పుడు కూడా ఆమె అభినందనలు అందుకున్నారు. అన్నింటికంటే ఐపీఎల్ చరిత్రలో వేలం ప్రక్రియను నిర్వహించిన తొలి మహిళ, అందులోనూ భారత సంతతి వ్యక్తి మల్లిక కావడం గమనార్హం. అయితే ఆమెకు ఈ ప్రక్రియ పై అనుభవం లేకపోయినప్పటికీ.. దానిని ఎలా నిర్వహించాలి అనే విషయంపై అవగాహన పెంచుకున్నారు. ఇందుకోసం ఎంతగానో నేర్చుకున్నారు.