https://oktelugu.com/

Telangana MLA: ఇలా కూడా ఇరికించేస్తారా.. అర్ధరాత్రి ఎమ్మెల్యేకు బట్టలన్నీ విప్పేసి ఓ మహిళ వీడియో కాల్‌.. కలకలం

రాజకీయాల్లో ప్రత్యర్థులపై ఒకప్పుడు విమర్శలు, ఆరోపణలు చేసేవారు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఒక్కడ దొరుకుతాడా.. ఎక్కడ ఇరికించేద్దామా.. అన్నట్లుగా ప్రత్యర్థులు కాచుకు కూర్చుంటున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 19, 2024 / 09:18 AM IST

    Telangana MLA

    Follow us on

    Telangana MLA: అన్నీ మారినట్లుగానే రాజకీయాలూ మారుతున్నాయి. ఒకప్పుడు ప్రజల పక్షాన నిలిచేవడు లీడర్‌. ఇప్పుడు డబ్బులు ఉన్నవాడే లీడర్‌. ఒకప్పుడు ప్రజలకు సేవ చేసేవారికే ఓట్లు వేసేవారు. ఇప్పుడు డబ్బులు పంచే నేతలకే ఓట్లు పడుతున్నాయి. ఒకప్పుడు ప్రత్యర్థులపై విమర్శలు, ఆరోపణలు మాత్రమే చేసేవారు. కానీ, ఇప్పుడు టెక్నాలజీ సాయంతో అడ్డంగా బుక్‌ చేయాలని చూస్తున్నారు. వాయిస్‌ రికార్డులు, వీడియో రికార్డులతో సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. తాజాగా కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు అలాంటి అనుభవమే ఎదురైంది. అర్ధరాత్రి సమయంలో ఎమ్మెల్యేకు వీడియో కాల్‌ వచ్చింది. లిఫ్ట్‌ చేయగానే ఎదురుగా ఒంటిపై ఎలాంటి బట్టలు లేకుండా.. ఓ మహిళ కనిపించింది. అప్రమత్తమైన సదరు ఎమ్మెల్యే వెంటనే ఫోన్‌ కట్‌చేసి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ఏం జరిగిందంటే..
    అక్టోబర్‌ 14న(సోమవారం) ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు గుర్తుతెలియని నంబర్‌ నుంచి వీడియోకాల్‌ వచ్చింది. ఆ కాల్‌ను సదరు ఎమ్మెల్యే లిఫ్ట్‌ చేయగానే.. స్క్రీన్‌పై ఒంటిపై ఎలాంటి బట్టలు లేకుండా.. ఓ మహిళ ప్రత్యక్షమైంది. దీంతో ఆ ప్రజాప్రతినిధి షాక్‌ అయ్యారు. టెక్నాలజీ సాయంతో స్క్రీన్‌ రికార్డు చేసే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే వెంటనే కాల్‌ కట్‌ చేశారు. ఎవరైనా తనను ఇరికించడానికే ఇలా న్యూడ్‌ కాల్‌ చేయించి ఉంటారా.. లేక నిజంగానే గుర్తుతెలియని వ్యక్తులు చేసి ఉంటారా అనే అనుమానంతో పోలీసులను ఆశ్రయించారు. నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌కు ఫిర్యాదు చేశారు. గురువారం(అక్టోబర్‌ 17న) తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ)లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

    పెరిగిన బెదిరింపు కాల్స్‌..
    ఈ మధ్యకాలంలో చాలా మందికి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. ముఖ్యంగా న్యూడ్‌ కాల్స్‌ బెడద ఎక్కువైంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే కూడా ఈ న్యూడ్‌ కాల్‌ బారిన పడ్డారు. అయితే సదరు ఎమ్మెల్యే ఇది ప్రత్యర్థుల పనిగా అనుమానిస్తున్నారు. తన ప్రతిష్ట దిగజార్చడానికి, తనను ఇరికించేందుకే ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారట.