Sammathame 13 Days Collections: కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’ సినిమాకి 12వ రోజు కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. నిజానికి ఈ సినిమాకి మొదటి షో నుంచే బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో ఈ సినిమా కలెక్షన్స్ పరిస్థితి దారుణంగానే ఉంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కనీస వసూళ్లు కూడా కలెక్ట్ చేయలేక చతికిలపడింది. ఈ సినిమా నిర్మాత కంకణాల ప్రవీణకు నష్టాలు మిగిలాయి. మరి 13వ రోజు ఈ సినిమాకు ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయో చూద్దాం రండి.

‘సమ్మతమే’ 13 డేస్ కలెక్షన్స్ ను ఏరియాల వారీగా గమనిస్తే..
Also Read: OTT Releases This Week: ఈ వీక్ : ఈ వారం ‘ఓటీటీ’, థియేటర్స్ చిత్రాల పరిస్థితేంటి ?
నైజాం 0.99 కోట్లు
సీడెడ్ 0.49 కోట్లు
ఉత్తరాంధ్ర 0.48 కోట్లు
ఈస్ట్ 0.23 కోట్లు
వెస్ట్ 0.18 కోట్లు
గుంటూరు 0.17 కోట్లు
కృష్ణా 0.22 కోట్లు
నెల్లూరు 0.16 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొదటి 13 రోజుల కలెక్షన్స్ గానూ 2.96 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 5.73 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.39 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి 13 రోజుల కలెక్షన్స్ గానూ 3.16 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా మొదటి 13రోజుల కలెక్షన్స్ గానూ ‘సమ్మతమే’ రూ. 6.29 కోట్లను కొల్లగొట్టింది

‘సమ్మతమే’ చిత్రానికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4.5 కోట్లుగా ఉంది. 13 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.3.16 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ కు మరో రూ.1.32 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇక ఈ సినిమా సేవ్ అవ్వడం కష్టమే. కోటి 10 లక్షలు నష్టపోయే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి ఈ సినిమాని చాలా చోట్ల తీసేసే అవకాశం ఉంది. కాబట్టి.. ఫైనల్ రిజల్ట్ ను బట్టి ఈ సినిమా ప్లాప్.
Also Read:Chor Baazar Collections: ‘చోర్ బజార్’ ‘క్లోజింగ్ కలెక్షన్స్’.. ఎన్ని కోట్లు లాస్ అంటే ?