https://oktelugu.com/

Diwali Movie Race : దీపావళి రేస్ లో విన్నర్ ఎవరో తేలిపోయింది..’లక్కీ భాస్కర్’ ని దాటేసిన కిరణ్ అబ్బవరం ‘క’..ఎంత వసూళ్లు వచ్చాయంటే!

వీకెండ్ లోపే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఈ మూడు సినిమాలకు ఉన్నాయి. మరి ఫుల్ రన్ లో వీటి రేంజ్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.

Written By:
  • Vicky
  • , Updated On : October 31, 2024 / 04:35 PM IST

    Diwali Movie Race

    Follow us on

    Diwali Movie Race :   ప్రతీ సంవత్సరం జరిగే దీపావళి పండుగకి రెండు మూడు సినిమాలు విడుదల అవ్వడం సర్వసాధరణమే. కానీ ఈసారి మాత్రం ఏకంగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వీటిల్లో ‘అమరన్’, ‘భగీర’ డబ్బింగ్ సినిమాలు కాగా, ‘లక్కీ భాస్కర్’, ‘క’ వంటి తెలుగు చిత్రాలు ఉన్నాయి. వీటిల్లో ‘భగీర’ చిత్రానికి తప్ప, మిగిలిన మూడు సినిమాలకు సూపర్ హిట్ టాక్స్ వచ్చాయి. ‘భగీర’ చిత్రానికి కేజీఎఫ్ సిరీస్, సలార్ వంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ కథ, మాటలు అందించాడు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ కి ఇంత పెద్ద ఫ్లాప్ చిత్రం పడుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు, ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రం గానే ఉన్నాయి. ఇక దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది.

    బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకి 15 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయంటే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందట. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని మొదటి రోజే 50 శాతంకి పైగా రికవరీ అవుతుందని అంచనా వేస్తున్నారు. ‘దేవర’ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను కొనుగోలు చేసిన నాగ వంశీ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. ‘దేవర’ తో ఇప్పటికే భారీ లాభాలను అందుకున్న ఆయన, ‘లక్కీ భాస్కర్’ తో మరో జాక్పాట్ అందుకున్నాడు. ఇది ఇలా ఉండగా తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన ‘అమరన్’ చిత్రానికి ‘లక్కీ భాస్కర్’ కి మించిన అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగు వెర్షన్ లో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ‘లక్కీ భాస్కర్’ టికెట్ రేట్స్ తో పోలిస్తే ‘అమరన్’ మూవీ టికెట్ రేట్స్ తక్కువ ఉండడం వల్ల, ఓవరాల్ తెలుగు వెర్షన్ ఓపెనింగ్స్ ‘లక్కీ భాస్కర్’ కంటే తక్కువే ఉంటుందని అనుకుంటున్నారు.

    ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయట. మరోపక్క కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రానికి కూడా మంచి టాక్ వచ్చింది. ఈ రెండు సినిమాలతో సమానంగా ఆ చిత్రానికి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో జరుగుతున్నాయి కానీ, షోస్ చాలా తక్కువ ఉండడం వల్ల ఓపెనింగ్స్ కేవలం 5 కోట్ల రూపాయిల షేర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే భారీ ఓపెనింగ్ అని చెప్పొచ్చు. కేవలం వీకెండ్ లోపే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఈ మూడు సినిమాలకు ఉన్నాయి. మరి ఫుల్ రన్ లో వీటి రేంజ్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.