Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి… ఇక తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈయన ప్రస్తుతం పాన్ వరల్డ్ లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే చాలామంది నటులు రాజమౌళితో సినిమా చేయాలని అనుకుంటారు. కానీ అందరికీ ఆ అవకాశం దక్కకపోవచ్చు. నిజానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క నటుడి టార్గెట్ కూడా రాజమౌళినే కావడం విశేషం. నిజానికి ఆయన సినిమాలో ఒక చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చినా కూడా ఏ ఒక్క నటుడు వదులుకోకుండా నటిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే రాజమౌళి సినిమాలో నటిస్తే వాళ్లకు ఎనలేని గుర్తింపు వస్తుందనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు అలా చేస్తున్నారని సినిమా మేధావులు కూడా వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేయడం విశేషం…ఇక ఇదిలా ఉంటే తెలుగులో ఆయన డైరెక్షన్ లో నటించే అవకాశాన్ని కోల్పోయిన నటులు చాలామంది ఉన్నారు. నిజానికి బాలకృష్ణతో రాజమౌళి సింహాద్రి సినిమాని చేయాలని అనుకున్నాడు. కానీ బాలయ్య బాబు అప్పటికే అలాంటి సినిమాలు చేసి ఉండడంతో ఆ సినిమాని రిజెక్ట్ చేశాడు. దాంతో ఎన్టీఆర్ తో ఈ సినిమాను చేసి భారీ సక్సెస్ ని అందుకున్నాడు.
అలా బాలకృష్ణ రాజమౌళి డైరెక్షన్ లో నటించే ఒక అరుదైన అవకాశాన్నైతే కోల్పోయాడనే చెప్పాలి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రాజమౌళితో ఒక సినిమా చేయాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. నిజానికి రాజమౌళి విక్రమార్కుడు సినిమాని పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించాలని చూశాడు. ఈ సినిమా కనక పవన్ కళ్యాణ్ కి పడితే ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా మారేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఏది ఏమైనా కూడా ఇలాంటి స్టార్ హీరోలు రాజమౌళి డైరెక్షన్ లో నటించే అవకాశాన్ని కోల్పోవడం అనేది నిజంగా ఒక రకంగా బ్యాడ్ విషయమనే చెప్పాలి. ఎందుకంటే హీరోల కెరియర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ నిలిచే సినిమాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి వీళ్ళకి కూడా అలాంటి ఒక కెరియర్ బెస్ట్ మూవీస్ అయితే వచ్చేవి.
తద్వారా వాళ్ల అభిమానులు కూడా చాలా ఆనంద పడుతూ ఉండేవారని చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి ఇప్పటికి పాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగిన కూడా మన తెలుగు హీరోలతోనే సినిమాలు చేస్తుండటం విశేషం…