https://oktelugu.com/

Kiran Abbavaram: నేను ఏమి పాపం చేసానని నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు అంటూ ఎమోషనల్ అయిపోయిన కిరణ్ అబ్బవరం!

ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా అక్కినేని నాగ చైతన్య వచ్చాడు. ఈ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ గా ఇచ్చిన ప్రసంగం ఇప్పుడూ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా నిల్చింది. ఈ సినిమా చాలా బాగుంటుందని, ఒకవేళ ఈ చిత్రం మీకు నచ్చకపోతే నేను చిత్ర పరిశ్రమ నుండి తప్పుకుంటానని చెప్పుకొచ్చాడు. అలాగే తనపై నిత్యం ట్రోల్స్ వేసే వారిపై కిరణ్ అబ్బవరం చాలా ఘాటుగా స్పందించాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 30, 2024 / 03:38 PM IST

    Kiran Abbavaram(1)

    Follow us on

    Kiran Abbavaram: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, అతి తక్కువ సమయం లోనే యూత్ ఆడియన్స్ లో మంచి గుర్తింపుని తెచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం. మొదటి సినిమా ‘రాజావారు..రాణివారు’ తో సూపర్ హిట్ ని అందుకున్న ఆయన, ఆ తర్వాత ‘SR కల్యాణమండపం’, ‘సమ్మతమే’, ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి సూపర్ హిట్ చిత్రాలు చేసాడు. ఆ తర్వాత వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో డీలాపడిన ఈ కుర్ర హీరో, ఇప్పుడు ‘క’ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రంతో ఈ దీపావళికి మన ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక సరికొత్త థ్రిల్లింగ్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది అనే విషయం ట్రైలర్ ని చూసిన తర్వాత అందరికీ అర్థమైంది.

    ఇది ఇలా ఉండగా నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా అక్కినేని నాగ చైతన్య వచ్చాడు. ఈ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ గా ఇచ్చిన ప్రసంగం ఇప్పుడూ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా నిల్చింది. ఈ సినిమా చాలా బాగుంటుందని, ఒకవేళ ఈ చిత్రం మీకు నచ్చకపోతే నేను చిత్ర పరిశ్రమ నుండి తప్పుకుంటానని చెప్పుకొచ్చాడు. అలాగే తనపై నిత్యం ట్రోల్స్ వేసే వారిపై కిరణ్ అబ్బవరం చాలా ఘాటుగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘ఈమధ్యనే ఒక సినిమాలో నా గురించి సెటైర్స్ వేస్తూ కొన్ని సన్నివేశాలు తీశారు. నేనేమి పాపం చేశాను రా నామీద ఇంత పగబట్టారు. మీ జోలికి నేనేమైన వచ్చానా?, నాపాటికి నేను సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. నేను ఎన్ని సినిమాలు చేస్తే మీకెందుకు, ఇప్పటి వరకు నేను 8 సినిమాలు చేస్తే అందులో నాలుగు సూపర్ హిట్స్ వచ్చాయి. నాలాంటి వాడికి సినిమాని పూర్తి చేసి విడుదల చేయడమే ఒక సక్సెస్. అలాంటిది చెప్పుకోదగిన నాలుగు డీసెంట్ సినిమాలు ఇచ్చాను, అది చాలదా’ అంటూ కిరణ్ అబ్బవరం ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    కిరణ్ అబ్బవరం ఏడాదికి మూడు సినిమాలను విడుదల చేసేవాడు. దీనిపై సోషల్ మీడియా లో ఫన్నీ ట్రోల్స్ చాలానే వచ్చాయి. మొదటి నుండి కిరణ్ అబ్బవరం ఈ ఫన్నీ ట్రోల్స్ పై బాధపడుతూ ఉండేవాడు. ఇది ఇలా ఉండగా గత ఏడాది విడుదలైన ‘బాయ్స్ హాస్టల్’ అనే చిత్రంలో కిరణ్ అబ్బవరం పై సెటైర్లు వేశారు. ఇది ఆయన మనసుకి చాలా బాధకలిగించింది. ఆ బాధని నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బయటపెట్టడం తో సోషల్ మీడియా లో నెటిజెన్స్ అయ్యో పాపం అంటూ కిరణ్ అబ్బవరం గురించి బాధపడుతున్నారు. ‘క’ చిత్రం సూపర్ హిట్ అవుతుందని, నిన్ను ద్వేషించేవారికి ఈ చిత్రం చెప్పుదెబ్బ లాగా నిలుస్తుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.