Gold: కేంద్రం “బంగారు దీపావళి”.. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి ఎంత గోల్డ్ తీసుకొచ్చిందంటే..

దీపావళి.. మహాలక్ష్మిని సవినయంగా ఇంటికి ఆహ్వానించే పండుగ. ఉత్తరాది, దక్షిణాది అని తేడా లేకుండా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 30, 2024 3:28 pm

Gold

Follow us on

Gold: దీపాల కాంతులు.. టపాసుల మోతలు.. బాణసంచా వెలుగులతో దీపావళి పండగ కాంతివంతంగా జరుగుతుంది. దీపావళి రోజున చెడు నశించిపోతుందని.. మంచి ప్రకాశిస్తుందని అందరూ నమ్ముతుంటారు. దీపావళిని కొన్నిచోట్ల మూడు రోజులపాటు జరుపుకుంటారు. తొలి రోజు నోము, మరుసటి రోజు లక్ష్మీ పూజ, చివరి రోజు సహపంక్తి భోజనాలు చేస్తుంటారు. దీపావళి రోజు జరిపే లక్ష్మీ పూజకు విశేషమైన ప్రాధాన్యం ఉంటుంది. ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా చాలామంది ఆ రోజు బంగారం కొనుగోలు చేసి.. మహాలక్ష్మి ఎదుట ఉంచుతారు. తద్వారా సిరిసంపదలు, భోగభాగ్యాలు లభిస్తాయని నమ్ముతుంటారు. అయితే దీపావళి రోజు బంగారం కొనుగోళ్లు తారాస్థాయిలో జరుగుతుంటాయి. కోట్లల్లో వ్యాపారం సాగుతుంటుంది. అయితే ఈసారి దేశ ప్రజలు మాత్రమే కాదు, కేంద్రం కూడా ముందుగానే దీపావళి జరుపుకుంది. అయితే ఆ పండుగను మామూలుగా కాదు… ఏకంగా లక్ష కిలోల బంగారంతో నిర్వహించుకుంది.

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి..

ధన్ తేరాస్ కు చాలామంది బంగారాన్ని కొని మహాలక్ష్మిని ఆహ్వానిస్తారు. అయితే ఈ పండుగను కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా జరుపుకుంది. లక్ష కిలోల బంగారంతో ఘనంగా నిర్వహించుకుంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి లక్షకిలోల బంగారాన్ని స్వదేశానికి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది మే 31న 100 టన్నుల బంగారాన్ని భారత్ నాగ్ పూర్ కు తరలించింది. ఇక ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బీఐఎస్ వద్ద 324 టన్నుల భారత బంగారం నిల్వ ఉంది. ప్రస్తుతం బంగారానికి డిమాండ్ పెరగడం.. అంతర్జాతీయంగా పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో బంగారాన్ని భారత్ భారీగా తీసుకొస్తున్నది. ఇదే సమయంలో ఫారెక్స్ నిల్వలు కూడా మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నది. మొత్తానికి ధన్ తేరాస్ పండుగ సందర్భంగా కేంద్రం అత్యంత రహస్య ఆపరేషన్ నిర్వహించి.. ఏకంగా లక్ష కిలోల బంగారాన్ని తీసుకురావడం సంచలనంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి..” దమ్మున్న ప్రభుత్వం గొప్ప చర్యలు తీసుకుంది. ఏకంగా ఆ స్థాయిలో బంగారాన్ని తీసుకొచ్చింది. ఇది గొప్ప విషయం. ఈ పండుగ ఎప్పటికీ గుర్తుండిపోతుందని” నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

బంగారం మాత్రమే కాకుండా ఇతర విలువైన లోహాలను భారత్ తీసుకొస్తోంది. ఇతర దేశాల నుంచి వజ్రాలు, ప్లాటినం, వైడూర్యాల వంటి వాటిని దిగుమతి చేసుకుంటున్నది. ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా అవతరించిన నేపథ్యంలో.. భవిష్యత్తు అవసరాలు.. మార్కెట్ అంచనాలు.. మారిపోతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని భారత్ ఈ పని చేసిందని.. ఇది దేశ ఆర్థిక రంగంలో మరొక మలుపు లాంటిదని ఆర్థిక నిపుణులు, మార్కెట్ అనలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు.