Kiran Abbavaram : ప్రముఖ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్(Rahasya Gorak) తో ప్రేమాయణం నడిపి, ఆమెతో చాలా రోజుల వరకు డేటింగ్ చేసి, గత ఏడాది ఆగష్టు నెలలో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్ళైన కొన్నాళ్లకే అభిమానులకు తల్లితండ్రులం కాబోతున్నాము అంటూ సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేశారు. దీంతో అందరూ ఎంతో సంతోషించారు. రహస్య గోరఖ్ హీరోయిన్ గా పెద్దగా బిజీ గా కూడా లేకపోవడం తో, బిడ్డని కనేందుకు అంగీకరించింది. కిరణ్ అబ్బవరం గత రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి కూడా ఆమె వచ్చింది. బేబీ బంప్ తో దర్శనమివ్వడం మనమంతా చూసాము. అయితే రహస్య గోరఖ్ నిన్న రాత్రి మగబిడ్డకు జన్మనిచ్చింది అంటూ కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా ద్వారా ఈ శుభవార్తని పంచుకున్నాడు.
‘హనుమాన్ జయంతి’ రోజు ఈ బిడ్డ పుట్టడం మేము చేసుకున్న అదృష్టమని, ఈ బిడ్డని ఆ దైవ ప్రసాదం గా భావిస్తామని ఆయన ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా ఆయన షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇందులో కిరణ్ అబ్బవరం తన బిడ్డ కాళ్ళను ముద్దాడుతూ కనిపించడం చూసేవాళ్లకు చాలా క్యూట్ గా అనిపించింది. అభిమానులు సోషల్ మీడియా ద్వారా కిరణ్ అబ్బవరం కి శుభాకాంక్షలు వెల్లువ కురిపిస్తున్నారు. ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండండి, ఆంజనేయ స్వామి అనుగ్రహం తో మీ బిడ్డ పుట్టాడు, ఇక ఆ బిడ్డకు తిరుగేలేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్ పరంగా వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న సమయం లో రహస్య గోరఖ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన నుండి విడుదలైన ‘క’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.
Also Read : దిల్ రూబ’ సున్నా షేర్ తో కిరణ్ అబ్బవరం అరుదైన రికార్డు!
ఒక విధంగా చెప్పాలంటే రహస్య గోరఖ్ మూడు మూళ్ళ బంధం తో కిరణ్ అబ్బవరం జీవితం లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన జాతకమే మారిపోయింది అని చెప్పొచ్చు. ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత ఆయన కెరీర్ కి ఎంత శుభం కలిసి వస్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా కిరణ్ అబ్బవరం కెరీర్ విషయానికి వస్తే, ‘క’ చిత్రం మొదలయ్యే ముందే ఆయన ‘దిల్ రూబా’ అనే చిత్రాన్ని ఒప్పుకున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 14 న విడుదలై ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘క’ లాంటి కాన్సెప్ట్ ని అంగీకరించిన కిరణ్ అబ్బవరం నుండి ఇలాంటి అవుట్ డేటెడ్ స్టోరీ ఎలా వచ్చింది అంటూ చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. కానీ ఇది రెండు మూడు సంవత్సరాల క్రితం కమిట్ అయిన సినిమా అని స్వయంగా కిరణ్ అబ్బవరం ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. మరి భవిష్యత్తులో ఆ రేంజ్ ఎలా ఉంటుందో చూడాలి.