Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) కెరీర్ లోనే ‘దిల్ రూబ'(Dilruba) చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎగురుకుంటూ వచ్చిన ఆయనకు ‘క'(Ka Movie) చిత్రం కొత్త ఊపిరి పోసింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా, ఇలాంటి అద్భుతమైన కాన్సెప్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు కిరణ్ అబ్బవరం పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన గత సినిమాలకు విమర్శించిన వాళ్ళే ఈ సినిమాకు ప్రశంసించారు. ఇదే లైన్ లో వెళ్తాడని అందరూ అనుకున్నారు, కానీ మళ్ళీ అవుట్ డేటెడ్ కాన్సెప్ట్ తో జనాల ముందుకు వచ్చేలోపు దారుణంగా రిజెక్ట్ చేసారు. మొదటి మూడు రోజులకు కలిపి ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయిల షేర్ కూడా రాలేదంటే నమ్ముతారా?, కానీ నిజంగానే రాలేదు.
Also Read : ‘దిల్ రూబ’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..’లైలా’ కంటే ఘోరమైన డిజాస్టర్..పాపం కిరణ్ అబ్బవరం!
ఇక నేడు అయితే ఈ సినిమాకు ప్రధాన నగరాల్లో కూడా డెఫిసిట్స్ పడ్డాయి. కనీసం థియేటర్ కరెంటు ఖర్చులకు కూడా డబ్బులు రాలేని పరిస్థితి. అందుకే సగానికి పైగా షోస్ తగ్గించేశారు. దీంతో నేడు ఈ చిత్రానికి సున్నా షేర్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమా విడుదలకు ముందు నుండే కిరణ్ అబ్బవరం తన టీం తో కలిసి ఒక పెద్ద మాఫియా నే నడిపించాడు. ఎవరైనా ఈ చిత్రం మీద నెగెటివ్ కామెంట్స్ చేస్తే వాళ్ళ అకౌంట్స్ కి రిపోర్ట్స్ కొట్టించి సస్పెండ్ అయ్యేలా చేసారు. విడుదల రోజు అయితే పైడ్ ట్వీట్స్ తో పాజిటివ్ రివ్యూస్ వేయించాడు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఒక మంచి సినిమాని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవ్వరూ ఆపలేరు అనేది ఎంత నిజమో, ఒక చెత్త సినిమాని ఎంత రుద్దాలని చూసినా డిజాస్టర్ అవ్వకుండా ఆపలేరు అనేది అంతే నిజం. ఈ సత్యం కిరణ్ అబ్బవరం ఎప్పుడు అర్థం చేసుకుంటాడో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
‘క’ లాంటి విన్నూతనమైన సబ్జెక్టు చేసిన మైండ్ సెట్ ఉన్న ఒక హీరో, అదే లైన్ మీద స్క్రిప్ట్ సెలెక్షన్స్ ని ఎంచుకుంటూ ముందుకు పోతారు. కానీ కిరణ్ అబ్బవరం ఎందుకు ఇలాంటి నాసిరకపు స్టోరీలైన్ తో సినిమా చేసాడు అని విశ్లేషకులకు సైతం అంతు చిక్కని ప్రశ్న. విడుదలకు ముందే ఆయన ప్రొమోషన్స్ లో ఒక విషయం చెప్పాడు. ‘క’ కంటే ముందే ఈ సినిమా పూర్తి అయ్యిందట, కానీ ముందుగా ‘క’ ని విడుదల చేస్తే బెటర్ అని ఆ సినిమాని వదిలారట. అందుకే రెండు సినిమాలకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అంటున్నారు విశ్లేషకులు. కిరణ్ అబ్బవరం నటన మార్చాలి, డైలాగ్ డెలివరీ మార్చాలి, స్క్రిప్ట్ సెలక్షన్ జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఈ మూడు లేకపోతే ఆయన షెడ్డుకి వెళ్లిపోవడం తథ్యం అని అంటున్నారు.
Also Read : కిరణ్ అబ్బవరం కి మరో ఎదురుదెబ్బ..మొదటిరోజు ‘దిల్ రూబా’ చిత్రానికి వచ్చిన గ్రాస్ ఇంత తక్కువనా?