Kirak Boys Khiladi Girls: గృహిణులకు సీరియల్స్ అంటే పిచ్చి. ఆ సీరియల్స్ లోని పాత్రలను వారు ఓన్ చేసుకుంటారు. అందుకే హీరో, హీరోయిన్ కి కష్టాలు వస్తే.. వారికి వచ్చినట్లు భావిస్తారు. ఇక విలన్స్ ని అయితే అడ్డమైన బూతులు తిడతారు. సీరియల్స్ లో వారు ఎంతగా ఇన్వాల్వ్ అవుతారంటే.. హీరోయిన్ ని ఓ విలన్ చంపడానికి వస్తుంటే, వాడొస్తున్నాడు తప్పించుకో అని కేకలు వేస్తారు. అంతగా వారు సీరియల్స్ తో ప్రయాణం చేస్తారు. గత మూడు దశాబ్దాలుగా టెలివిజన్ రంగాన్ని సీరియల్స్ ఏలుతున్నాయి.
Also Read: ఆ విషయంలో రాజమౌళికి పోటీ ఇస్తున్న నాని, ఇది కదా హీరోకి కావాల్సింది!
ప్రస్తుతం ప్రసారం అవుతున్న పాప్యులర్ సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి. కావ్య, రాజ్ ప్రధాన పాత్రలు. కావ్య అలియాస్ కళావతి పాత్రను దీపిక రంగనాథ్ చేస్తుంది. ఇక రాజ్ పాత్రను మానస్ చేస్తున్నాడు. రాజ్ తన గతం మర్చిపోవడంతో యామిని అనే యువతి అతన్ని వలలో వేసుకునే పనిలో ఉంది. అతడితో పెళ్ళికి సిద్ధం అవుతుంది. కావ్య మాత్రం రాజ్ కి గతం గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. రాజ్ గతం మర్చిపోయిన తతంగం చాలా ఎపిసోడ్స్ గా సాగుతుంది.
రాజ్ కి కళావతి దూరం కావడం ఇష్టం లేని ఓ బామ్మ రాజ్ ని ఆఫ్ స్క్రీన్ లో ఏకిపారేసింది. ఈ బామ్మ గతంలో సీరియల్ విలన్ ని తిడుతూ ఫేమస్ అయ్యింది. ఆమె బంచిక్ బబ్లు బామ్మ. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో బంచిక్ బబ్లు సైతం కంటెస్ట్ చేస్తున్నాడు. దాంతో బామ్మకు ఎంట్రీ దక్కింది. రాజ్ తో మాట్లాడేందుకు బామ్మను శ్రీముఖి వేదిక మీదకు పిలిచింది. వస్తూనే రాజ్ పై ఆమె మండి పడింది.
ఇంకెన్నాళ్లు గతం మర్చిపోతావు. కళావతికి దూరంగా ఉంటావు?. యామినికి దగ్గరయ్యావు. మళ్ళీ కళావతికి ఫోన్లు చేస్తావు. అసలు నీకు గతం గుర్తుకు వచ్చేది ఎప్పుడు? అని బామ్మ గట్టిగా అడిగింది. అందుకు రాజ్.. మరో 300 ఎపిసోడ్స్ తర్వాత అన్నాడు. అప్పటికి కళావతి జీవితం ఏం కాను.. అంటూ ఇంకా ఫైర్ అయ్యింది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ లో ఈ సీన్ ఆసక్తి రేపింది.
View this post on Instagram