Kingdom : పెళ్లిచూపులు (Pelli Chupulu) సినిమాతో హీరోగా పరిచయమైన నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)…మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ట్ హీరోగా మారిపోయాడు. ఈ రెండు సినిమాలతో తను ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఈ సినిమాలతో పాటుగా ‘గీతా గోవిందం’ సినిమాతో మొదటిసారి 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇక ఈయనకు ఆ తర్వాత నుంచి సరైన సక్సెస్ అయితే రావడం లేదు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన చేస్తున్న సినిమాలతో ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేసినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించడం లేదు. దాంతో ఇప్పుడు చేస్తున్న కింగ్ డమ్ (kingdom) సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు.
Also Read : 50 సెకండ్స్ లో భీభత్సం..సంచలనం రేపుతున్న ‘కింగ్డమ్’ మొదటి సాంగ్ ప్రోమో!
మరి అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీ భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…అయితే ఈ సినిమా ఈ నెల చివర్లో రిలీజ్ అవ్వనున్న నేపద్యంలో ఇప్పటికే ఈ సినిమా మీద ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ అయితే రిలీజైంది. ఆ సాంగ్ కూడా ప్రేక్షకుల మన్ననలను పొందుతుంది.
మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నాడు అంటే ఇందులో హీరో విలన్ రెండు అతనే పోషిస్తున్నాడా? లేదంటే రెండు పాజిటివ్ క్యారెక్టర్స్ లోనే నటిస్తున్నాడా? అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసే దిశగా ముందుకు దూసుకెళుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి మంచి కంబ్యాక్ ఇవ్వాలనే ప్రయత్నంలో విజయ్ ఉన్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : కింగ్ డమ్ మూవీ రామ్ చరణ్ రిజెక్ట్ చేయడానికి సుకుమారే కారణమా..?