https://oktelugu.com/

Kicha Sudeep: కె 3 కోటికొక్కడు ట్రైలర్.. ఇరగదీసిన సుదీప్

Kicha Sudeep: కె 3  కోటికొక్కడు మూవీ ట్రైలర్ చూస్తోంటే.. బాలీవుడ్ మూవీ రేంజ్‌ని తలపించే ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి.  ఈ సినిమాలో కిచ్చ సుదీప్‌తో పాటు మడోన్నా సెబాస్టియన్, అశిక, శ్రద్ధ, రవిశంకర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కిచ్చ సుదీప్ హీరోగా నటిస్తున్న K3 కోటికొక్కడు మూవీ ట్రైలర్ తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చింది. కిచ్చ సుదీప్ మన తెలుగు హీరో కాకపోయినా… తెలుగు ఆడియెన్స్ అందరికీ ఎంతో సుపరిచితుడే. కన్నడ నాట స్టార్ […]

Written By: , Updated On : October 20, 2021 / 11:58 AM IST
Follow us on

Kicha Sudeep: కె 3  కోటికొక్కడు మూవీ ట్రైలర్ చూస్తోంటే.. బాలీవుడ్ మూవీ రేంజ్‌ని తలపించే ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి.  ఈ సినిమాలో కిచ్చ సుదీప్‌తో పాటు మడోన్నా సెబాస్టియన్, అశిక, శ్రద్ధ, రవిశంకర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కిచ్చ సుదీప్ హీరోగా నటిస్తున్న K3 కోటికొక్కడు మూవీ ట్రైలర్ తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చింది.

kicha-sudeeps-k3-kotikokkadu-movie-trailer- released

కిచ్చ సుదీప్ మన తెలుగు హీరో కాకపోయినా… తెలుగు ఆడియెన్స్ అందరికీ ఎంతో సుపరిచితుడే. కన్నడ నాట స్టార్ హీరో అయినప్పటికీ.. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాలో విలన్ పాత్రతో మెప్పించాడు. అలానే బాహుబలి సినిమాలో తెలుగు వారికే కాకుండా బాలీవుడ్ ఆడియెన్స్‌కి కూడా గుర్తుండిపోయేలా చేశాడు. అలా టాలీవుడ్‌ లోనూ కొంత ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్న నటుడు కిచ్చ సుదీప్.

తెలుగు వారితో కిచ్చ సుదీప్‌కి ఉన్న అనుబంధం సినిమాలకు మించిందే అని చెప్పుకోవచ్చు. ఆ అనుబంధంతోటే తాజాగా తెలుగు వారి ముందుకు కె  3  కోటికొక్కడు అనే సినిమాతో మరోసారి ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. శివ కార్తిక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే నిర్మిస్తున్నారు. ప్రముఖ కన్నడ కంపోజర్ అర్జున్ జన్య … ఈ సినిమాకి బాణీలు సమకూరుస్తున్నాడు. ముఖ్యంగా ఈ ట్రెయిలర్ సుదీప్ లుక్స్, విజువలస్ హైలైట్ అని చెప్పొచ్చు. మడోన్నా సెబాస్టియన్ కూడా ఈ మూవీ కి ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఈ ట్రెయిలర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.   ప్రస్తుతం ఈ ట్రెయిలర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.