Akkineni Akhil: అక్కినేని అఖిల్… వరుస పరాజయాల అనంతరం ఎట్టకేలకు ఒక బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతా లో వేసుకున్నాడు. దసరా కానుకగా రిలీజైన ఈ యంగ్ హీరో చిత్రం ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ” మంచి హిట్ టాక్ తో కలెక్షన్ ల పరంగా కూడా దూసుకుపోతుంది. దీంతో అక్కినేని ఫ్యామిలి తో పాటు అక్కినేని అభిమానుల్లో కూడా ఫుల్ జోష్ నెలకొందని తెలుస్తుంది. అయితే ఈ తరుణంలో అఖిల్ కొత్త చిత్రంపై ఒక ఆసక్తికర విషయం సినీవర్గాల్లో ఇంటరెస్టింగ్ గా మారింది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో … అనిల్ సుంకర భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్న చిత్రం ” ఏజెంట్ “. ఈ సినిమా అఖిల్ కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఈ చిత్రంతో అఖిల్ కెరీర్ మరో స్థాయికి వెళ్తుందన్న అంచనాతో అక్కినేని అభిమానులు ఉన్నారు. కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు ఓ అగ్ర నటుడిని ఎంపిక చేసే ప్రయత్నంలో మూవీ యూనిట్ ఉందని తెలుస్తోంది. ఈ మేరకు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పేరు ముందు వినిపించగా… పలు కారణాల వల్ల ఆయన ఆఫర్ ఒకే చెప్పలేదని అంటున్నారు.
అయితే సూపర్ స్టార్ మమ్ముట్టిని ఈ సినిమాకు పచ్చ జెండా ఊపారని సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ తమిళ పీఆర్వో శ్రీధర్ పిళ్లై తన ట్విట్టర్ అకౌంట్లో వెల్లడించారు. ఇందులో మమ్ముట్టి చేయబోయేది ఆర్మీ ఆఫీసర్ పాత్ర అని కూడా ఆయన తెలిపారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం త్వరలోనే అఖిల్, మమ్ముట్టి యూరప్‌కు వెళ్లనున్నారని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
In #AkhilAkkineni new film #Agent (Telugu),an espionage thriller @mammukka plays an army officer. It is directed by #SurenderReddy. #Mammooty and #Akhil are going to Europe next week for the outdoor shoot. pic.twitter.com/Frx1oqU8J6
— Sreedhar Pillai (@sri50) October 19, 2021