https://oktelugu.com/

Jai Bheem: ట్రెండింగ్​లో దూసుకెళ్తోన్న జై భీమ్​

Jai Bheem: ప్రముఖ దర్శకుడు జ్ఞానవేల్, సూర్య హీరోగా తెరకెక్కిస్తోన్న చిత్రం జైభీమ్​.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్​ శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ఈ సినిమా పోస్టర్​, ప్రోమోలతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది చిత్రబృందం.  తాజాగా, సినిమా టీజర్​ విడుదల చేయగా.. సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చిన 4రోజుల్లో 15 మిలియన్స్​కి పైగా వ్యూస్​ సాధించి ట్రెండింగ్​లో నిలిచింది. దీంతో ఈ సినిమా ఏలా ఉండబోతోందనే అంశంపై నెట్టించ చర్చలు కొనసాగుతున్నాయి.   జ్యోతిక, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 20, 2021 / 12:01 PM IST
    Follow us on

    Jai Bheem: ప్రముఖ దర్శకుడు జ్ఞానవేల్, సూర్య హీరోగా తెరకెక్కిస్తోన్న చిత్రం జైభీమ్​.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్​ శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ఈ సినిమా పోస్టర్​, ప్రోమోలతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది చిత్రబృందం.  తాజాగా, సినిమా టీజర్​ విడుదల చేయగా.. సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చిన 4రోజుల్లో 15 మిలియన్స్​కి పైగా వ్యూస్​ సాధించి ట్రెండింగ్​లో నిలిచింది. దీంతో ఈ సినిమా ఏలా ఉండబోతోందనే అంశంపై నెట్టించ చర్చలు కొనసాగుతున్నాయి.

     

    జ్యోతిక, సూర్య జంటగా నిర్మిస్తున్న ఈ సినిమా ఓటీటీ ప్లాట్​ఫామ్​ అమెజాన్ ప్రైమ్​లో విడుదల కానుంది. నవంబరు 2న జైభీమ్​ ప్రేక్షకుల ముందుకు  రానుంది. సీన్​ రోల్డాన్​ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. ప్రకాశ్​రాజ్​, రమేశ్​, రజిష, విజయన్​, మనికందన్​ తదిరత ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

    మరోవైపు ఇటీవలే నెట్​ఫ్లిక్స్​లో విడుదలైన నవరస వెబ్​సిరీస్​లోనూ సూర్య నటించారు. ఒక్కో ఎపిసోడ్​ను ఒక్కో ఎమోషన్​కు ప్రతిరూపంగా 9 ఎపిసోడ్స్​ను రూపొందించారు. ఇందులో ప్రేమ అనే అధ్యాయంలో సూర్య నటించారు. ఈ సినిమా టీజర్​కే ప్రేక్షకుల్లో విపరీతమైన స్పందన లభించింది. చెన్నై, ముంబయి ప్రాంతాల్లో విపరీతమైన క్రేజ్​ లభించింది. ఇక దుబాయ్​ బుర్జ్​కలీఫాపై నవరస టీజర్​ను ప్రదర్శించడం విశేషం. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునే కార్యక్రమంలో భాగంగా ఫండ్​రైజ్​ చేస్తూ.. ఈ సినిమా రూపొందించడం జరిగింది.

    ఇందులో ఒక్కో ఎపిసోడ్​కు ఒక్కో డైరెక్టర్​ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్​కు మణిరత్నం, అరవింద్​ స్వామి, ప్రభాకర్​, సెల్వ తదితరులు రచన అందించారు. సూర్యతో పాటు, రేవతి, విజయ్​సేతుపతి, ప్రకాశ్​రాజ్​ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మణిరత్నం, జయేంద్ర పంచపకేశన్​ ఈ వెబ్​సిరీస్​కు నిర్మాతలుగా వ్యవహరించారు.