https://oktelugu.com/

బాయ్ ఫ్రెండ్ ని కలవనిచ్చేవారు కాదు… ఆ వేదన చెప్పలేనిది !

బ్యూటీ కియారా అద్వానీ కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకువెళుతుంది. బాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న కియారా అక్కడ స్టార్ హీరోయిన్ హోదాపై కన్నేశారు. గత ఏడాది కియారా నటించిన కబీర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. రూ.350 కోట్ల వసూళ్లకు పైగా రాబట్టిన ఆ మూవీ 2019 గానూ సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. కియారా నటించిన ఇందుకీ జవానీ ఇటీవల విడుదలైంది. కియారా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ […]

Written By:
  • admin
  • , Updated On : December 13, 2020 / 10:35 AM IST
    Follow us on


    బ్యూటీ కియారా అద్వానీ కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకువెళుతుంది. బాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న కియారా అక్కడ స్టార్ హీరోయిన్ హోదాపై కన్నేశారు. గత ఏడాది కియారా నటించిన కబీర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. రూ.350 కోట్ల వసూళ్లకు పైగా రాబట్టిన ఆ మూవీ 2019 గానూ సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. కియారా నటించిన ఇందుకీ జవానీ ఇటీవల విడుదలైంది. కియారా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ పాజిటివ్ టాక్ అందుకుంది.

    Also Read: మెగాస్టార్ కి కథ చెప్పనున్న వెంకీ !

    ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కియారా తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టీనేజ్ వయసులోనే కియారా ప్రేమలతో పడ్డారట. ఈ విషయం కియారా పేరెంట్స్ కి తెలియడంతో ఆమెను కట్టడి చేశారట. అతని ప్రేమలో పడి చదువు, కెరీర్ నాశనం చేసుకుంటుందని భావించిన ఆమె తల్లిదండ్రులు… కనీసం అతనితో ఫోన్ కూడా మాట్లాడనిచ్చేవారు కాదట. ఆ సమయంలో తన గుండె పగిలినంత పనైనదని… కియారా తన టీనేజ్ లవ్ స్టోరీ రివీల్ చేశారు.

    Also Read: సుధీర్ కు సీమంతం.. ఇదేందయ్యా ఇదీ..?!

    ఇక ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నాను అంటున్న కియారా… ఒకవేళ నచ్చినవాడితో డేట్ కి వెళితే వెంటనే ముద్దు ఇవ్వను అన్నారు. తన కిస్ కోసం అతడు ఆరాటపడేలా చేసిన తరువాత మాత్రమే అతనికి ఆ అదృష్టం కల్పిస్తానని ఓపెన్ గా చెప్పేసింది. బాలీవుడ్ యంగ్ హీరో సిదార్థ్ మల్హోత్రాతో కియారా ఎఫైర్ నడిపినట్లు వార్తలు రావడం జరిగింది. ఇక తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలలో కియారా నటించిన సంగతి తెలిసిందే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్