Kiara Advani : పాన్ ఇండియా లెవెల్ లో యూత్ ఆడియన్స్ విపరీతంగా ఇష్టపడే యంగ్ హీరోయిన్స్ లో ఒకరు కియారా అద్వానీ(Kiara Advani). ఈమె మన టాలీవుడ్ లోకి ‘భరత్ అనే నేను’ చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యాక ఈమెకు అవకాశాలు బాగానే వచ్చాయి కానీ, ఆమె టాలీవుడ్ కంటే ఎక్కువగా బాలీవుడ్ కి ప్రాధాన్యత చూపించింది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఈమె ‘భరత్ అనే నేను’ తర్వాత రామ్ చరణ్(Global Star Ramcharan) తో కలిసి ‘వినయ విధేయ రామ’, ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. రామ్ చరణ్ కి ఈమె అన్ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. కానీ బాలీవుడ్ లో మాత్రం ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.
Also Read : రామ్ చరణ్ హీరోయిన్ కియారా రచ్చ… పెళ్లయ్యాక కూడా ఇవేం ఫోజులు బాబోయ్!
ఇది ఇలా ఉండగా ఈమె ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా(Siddarth Malhotra) ని 2023 వ సంవత్సరం, ఫిబ్రవరి 7వ తారీఖున పెళ్లాడింది. వీళ్లిద్దరి వివాహం అభిమానులకు ఒక పెద్ద సర్ప్రైజ్. అప్పటి వరకు వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి కానీ, అవి కేవలం రూమర్స్ మాత్రమే అని కియారా అద్వానీ అనేక సార్లు కొట్టిపారేసింది. కానీ అకస్మాత్తుగా సిద్దార్థ్ మల్హోత్రా ని పెళ్ళాడి అందరికీ షాకింగ్ సర్ప్రైజ్ ని ఇచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు త్వరలోనే వీళ్లిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారట. ఈ విషయాన్ని ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పెళ్ళైన రెండేళ్లకే కెరీర్ గురించి ఆలోచించకుండా, కుటుంబం గురించి అలోచించి బిడ్డని కనేందుకు సిద్దమైన కియారా అద్వానీ ని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి అమ్మాయిలు దొరకడం చాలా అరుదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఎందుకంటే హీరోయిన్స్ సాధారణంగా పెళ్లి అయ్యాక తమ అందం డ్యామేజ్ అవుతుందేమో అనే భయంతో పిల్లల్ని కనేందుకు ఇష్టపడరు. ఈ విషయంలో గొడవలై విడిపోయిన భార్యాభర్తలను మనం ఎన్నో సందర్భాల్లో చూసే ఉంటాము. కానీ కియారా అద్వానీ కి ఇంత మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, ఎంతో గొప్ప కెరీర్ ఉన్నప్పటికీ కూడా తల్లి అయ్యేందుకు సిద్ధపడిందంటే నిజంగా ఆమెని అభినందించేసిందే. ప్రస్తుతం కియారా అద్వానీ కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యాష్(Rocking Star Yash) తో ‘టాక్సిక్'(Toxic Movie) అనే చిత్రంలో నటిస్తుంది. అదే విధంగా హ్రితిక్ రోషన్(Hritik Roshan), ఎన్టీఆర్(Junior NTR) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వార్ 2′(War 2 Movie) మూవీ షూటింగ్ లో కూడా కియారా అద్వానీ నటిస్తుంది. ఈ ఏడాది లోనే ఈ రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె సినిమాల్లో కొనసాగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read : దిల్ రాజు కి అల్లు అర్జున్ బంపర్ ఆఫర్..ఇలాంటి ఛాన్స్ ఏ నిర్మాతకు రాదేమో..ఎందుకు ఇంత స్పెషల్ ట్రీట్మెంట్?