KGF Chapter 3 : ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ లో రికార్డ్స్ ని సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ చిత్రం ‘కేజీఎఫ్’. మొదటి చాప్టర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో, రెండవ చాప్టర్ అంతకంటే పెద్ద హిట్ అయ్యింది. కన్నడ ఇండస్ట్రీ లో వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టడమే అతి కష్టమైన ఈ రోజుల్లో, ఈ చిత్రం ఏకంగా 1400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఒక విధంగా చెప్పాలంటే రాజమౌళి సైతం ఈ సినిమా సాధించిన రికార్డ్స్ ని చూసి భయపడ్డాడు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఆయన తెరకెక్కించిన భారీ బడ్జెట్ మల్టీస్టార్రర్ చిత్రం ‘#RRR’ ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా విడుదలైన రెండు వారాలకే ‘కేజీఎఫ్ : చాప్టర్ 2’ విడుదలై 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టడం ఆరోజుల్లో ఒక సెన్సేషన్.
Also Read : ఓదెల 2′ ఓపెనింగ్స్.. తమన్నా రెమ్యూనరేషన్ కూడా రికవర్ అయ్యేలా లేదు!
కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ చిత్రానికి 110 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోండి. ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది. ఈ సినిమా విడుదలై ఏప్రిల్ 14 నాటికి సరిగ్గా మూడేళ్లు అయ్యింది. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ఒక వీడియో అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేశాయి. ‘కేజీఎఫ్ 2’ లోని యాక్షన్ సన్నివేశాలు మొత్తం కలిపి ఒక ఎడిట్ చేసి, చివర్లో 1978 వ సంవత్సరం నుండి 1982 గ్యాప్ లో రాకీ భాయ్ ఏమయ్యాడు, ఎక్కడున్నాడు, విదేశాల్లో ఎలాంటి భీభత్సం సృష్టించాడు? అనేది తెలుసుకోవాలంటే ‘కేజీఎఫ్ : చాప్టర్ 3′(KGF : Chapter 3) వచ్చే వరకు ఎదురు చూడండి, ‘సీ యూ సూన్’ అంటూ హీరో యాష్ వాయిస్ లో చెప్పే డైలాగ్ అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది.
ప్రశాంత్ నీల్(Prashanth Neel) వరుసగా కమిట్ అవుతున్న సినిమాలను చూసి, ఇప్పట్లో ‘కేజీఎఫ్ 3’ ఉండదేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ని మర్చిపోలేదు, కచ్చితంగా ఉంటుంది అని మరోసారి ఈ వీడియో ద్వారా అండర్ లైన్ చేశారు మేకర్స్. కానీ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) తో ‘డ్రాగన్’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన ప్రభాస్ తో ‘సలార్ 2’ చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత ఆయన ‘కేజీఎఫ్ 3’ పట్టాలెక్కించే అవకాశం ఉంది. కానీ అప్పటికీ హీరో యాష్(Rocking Star Yash) ఖాళీగా ఉండాలి, లేకపోతే ప్రశాంత్ నీల్ రామ్ చరణ్(Global Star Ram Charan) తో కూడా ఒక సినిమా కమిట్ అయ్యాడు, ఆ చిత్రాన్ని ముందుగా మొదలు పెట్టాల్సి ఉంటుందేమో. చూడాలి మరి, ‘కేజీఎఫ్ 3’ కి 2000 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టేంత సత్తా ఉంది.
He came… He saw… He conquered!
Celebrating 3 GLORIOUS YEARS of #KGFChapter2 and the Monster’s mayhem at the box office ❤️
– https://t.co/atPSFXN1nA#3YearsOfKGF2Rampage@TheNameIsYash #PrashanthNeel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7… pic.twitter.com/HMYimSa35a
— Hombale Films (@hombalefilms) April 14, 2025