Odela 2 Movie : చాలా కాలం గ్యాప్ తర్వాత హీరోయిన్ తమన్నా(Tamannaah Bhatia) మన టాలీవుడ్ లో చేసిన థియేట్రికల్ చిత్రం ‘ఓదెల 2′(Odela 2 Movie). ఇన్ని రోజులు హీరోయిన్ క్యారెక్టర్స్ చేసిన తమన్నా, మొట్టమొదటిసారి ఈ చిత్రం ద్వారా లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు తో మన ముందుకు వచ్చింది. నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. ఇక థియేట్రికల్ రైట్స్ కూడా దాదాపుగా 11 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. అలా విడుదలకు ముందే నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్స్ ని మిగిల్చిన ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని చూసి, కచ్చితంగా సినిమా అదిరిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఈ సినిమాలోని మొదటి 25 నిమిషాలు ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకున్నప్పటికీ, ఆ తర్వాత సినిమా మాత్రం రొటీన్ ఫార్మటు లో ఉండడంతో మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ వచ్చింది.
Also Read : ‘కూలీ’ లో 5 నిమిషాల పాత్ర కోసం అమీర్ ఖాన్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా!
ఫలితంగా ఓపెనింగ్స్ పై బలమైన ప్రభావం చూపించింది. గడిచిన 24 గంటల్లో బుక్ మై షో లో ఈ సినిమాకు కేవలం 8 వేల టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయాయి. మొదటి రోజు గంటకు కనీసం వెయ్యి టిక్కెట్లు అయినా అమ్ముడుపోయే రేంజ్ లో ఉంటే, ఓపెనింగ్స్ పర్వాలేదు, డీసెంట్ రేంజ్ లో ఉన్నాయి అనే రేంజ్ లో అనిపించేవి. కానీ ఈ చిత్రానికి అలా లేదు. తమన్నా లాంటి క్రేజీ స్టార్ హీరోయిన్ ని పెట్టుకొని కూడా ఇంత తక్కువ వసూళ్లు అంటే టాక్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఇలాంటి జానర్ సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్ వసూళ్లు వస్తుంటాయి. కానీ ఎందుకో ఈ చిత్రం విషయంలో మాత్రం మిస్ ఫైర్. బహుశా ప్రీ రిలీజ్ కంటెంట్ లోని తమన్నా లేడీ అఘోరా గెటప్ ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ అయ్యి ఉండకపోయిండొచ్చు అని అంటున్నారు విశ్లేషకులు.
అంతే కాకుండా ఈ సినిమాని మిడ్ వీక్ రిలీజ్ చేయడం కూడా పెద్ద మైనస్ అయ్యిందని అంటున్నారు. సాధారణంగా సినిమాలు శుక్రవారం రోజున విడుదల అవుతుంటాయి. కొన్ని సినిమాలను కంటెంట్ మీద నమ్మకం తో మిడ్ వీక్ రిలీజ్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా కంటెంట్ మీద కూడా నమ్మకంతో మిడ్ వీక్ రిలీజ్ చేశారు, ప్లాన్ బెడిసికొట్టింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజున కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రావడం కష్టమే అని అంటున్నారు. షేర్ కనీసం 60 లక్షల రూపాయిలు కూడా ఉండకపోవచ్చు. వీకెండ్ లో పికప్ అయితే సరేసరి, లేకపోతే 70 శాతానికి పైగా నష్టాలతో బయ్యర్స్ దారుణంగా దెబ్బ తినే అవకాశం ఉంది. చూడాలి మరి ఈ చిత్రం ఫుల్ రన్ లో ఏమేరకు వసూళ్లను రాబడుతుంది అనేది.