Mohan Babu and Manoj : మంచు ఫ్యామిలీ కుటుంబ వివాదాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. నిన్న గాక మొన్న మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మంచు మనోజ్ హల్చల్ చేయడం, కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు మనోజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేయడం , మళ్ళీ మనోజ్ మోహన్ బాబు పై ఫిర్యాదు చేయడం. ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ రచ్చ లేపారు. నేడు మోహన్ బాబు తాను కష్టపడి నిర్మించుకున్న ఇంట్లో నా అనుమతి లేకుండా ఉండేందుకు ఎవరికీ అనుమతి లేదని, తక్షణమే వారందరినీ ఖాళీ చేయించాలని జిల్లా మేజిస్ట్రేట్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేసాడు. తాను నివాసం ఉంటున్న జల్ పల్లిలో తన ఆస్తులను కొందరు ఆక్రమించారని ఆయన ఫిర్యాదు లో పేర్కొన్నాడు. వాళ్ళని వెంటనే ఖాళీ చేయించి వాటిని తనకి అప్పగించాలని ఈ సందర్భంగా మోహన్ బాబు పోలీసులకు విన్నవించుకున్నాడు. ఆ ఆస్తుల్లో ఉంటున్నది మరెవరో కాదు, ఆయన రెండవ కుమారుడు మంచు మనోజ్.
కన్న కొడుకుని ఇంట్లో నుండి గెంటేయమని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన మొట్టమొదటి తండ్రిగా మోహన్ బాబు రికార్డ్స్ లోకి ఎక్కుతాడేమో. ఎంతో క్రమశిక్షణ తో తన ముగ్గురు పిల్లలను పెంచుకున్న మోహన్ బాబు, ఇంతలా ఫైర్ అయ్యాడంటే మనోజ్ ఎంత క్రమశిక్షణ తప్పాడో అర్థం అవుతుందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇంట్లో గుట్టుగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలను వీధిలోకి తెచ్చింది మంచు మనోజే. ప్రతీ ఇంట్లోనూ గొడవలు ఉంటాయి. గొడవలు లేని ఇల్లు ఈ ప్రపంచం లో ఎక్కడా ఉండదు. కానీ ఆ గొడవలను ఇలా పబ్లిక్ గా జనాల ముందుకు తీసుకొచ్చి కుటుంబ పరువు తీయాలని ఎవ్వరూ అనుకోరు. కానీ మనోజ్ ఆ పని చేసాడు. అందుకు మోహన్ బాబు ఇలా రియాక్ట్ అవ్వడం లో అసలు తప్పు లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
మొదటి నుండి మనోజ్ కి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి మంచి సపోర్టు ఉంది. కానీ ఈ గొడవ పట్ల మనోజ్ స్పందించిన తీరు, అదే విధంగా విష్ణు స్పందించిన తీరు చూస్తే ఇద్దరిలో ఎవరిదీ తప్పు, ఎవరిదీ ఒప్పు అనేది అర్థం అవుతుంది. విష్ణు అనేకసార్లు మీడియా ముందుకు వచ్చాడు. రిపోర్టర్స్ ఈ విషయం గురించి ఆయన్ని అడగ్గా, నేను నా కుటుంబ సమస్యల గురించి పబ్లిక్ లో మాట్లాడను, అది మా ప్రైవేట్ వ్యవహారం, మీకు తెలియాల్సిన అవసరం లేదు అని చెప్పుకొచ్చాడు. మంచు విష్ణు కూడా మనోజ్ పై ఆరోపణలు చేస్తూ, తప్పు మొత్తం అతనిదే అని జనాలకు చూపించే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇప్పటి వరకు ఆయన అలా చేయలేదు. ఈ ప్రవర్తన బట్టే చెప్పొచ్చు ఎవరు ఏమిటి అనేది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.