Akkineni Akhil: యంగ్ హీరోయిన్ కేతిక శర్మకి టాలెంట్ లేకపోయినా ఫుల్ గ్లామర్ ఉంది. ఇక ఎక్స్ ప్రెషన్స్ పలికించలేకపోయనా ఫుల్ ఎక్స్ పోజింగ్ చేస్తూ బాగానే హడావిడి చేస్తోంది. అందుకే కేతిక శర్మకు బాగానే అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ యంగ్ హీరో అఖిల్ హీరోగా వస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాకి భరత్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నాడు.

కాగా ఈ చిత్రంలో కేతిక శర్మకి ఛాన్స్ రావడానికి ముఖ్య కారణం పూరి అని తెలుస్తోంది. ఆయనే ఏరికోరి కేతిక శర్మకి అవకాశం ఇప్పించాడట. రెండేళ్లుగా తెలుగులో కేతిక శర్మకు చెపుకోతగ్గ స్థాయిలో అవకాశాలు రాలేదు. తన హవా టాలీవుడ్ లో కాస్త తగ్గుముఖం పట్టిందని తెలుసుకున్న ఈ బ్యూటీ, రెమ్యునరేషన్ విషయంలో కూడా చూసి చూడనట్టు పోతుంది.
మరోపక్క బాలీవుడ్ కి కూడా మకాం మార్చింది. అక్కడ చిన్న సినిమాలతోనైనా ఎంట్రీ ఇవ్వాలని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ వర్కౌట్ కాలేదు. దాంతో అక్కడి దర్శకనిర్మాతలను ఆకట్టుకోవడానికి ఎక్స్ పోజింగ్ లో పరిధి దాటింది. అమ్మడు అందం అదుర్స్ అన్నారు. దానికి తోడు కేతిక శర్మ కూడా గ్లామర్ డోస్ ను రోజురోజుకు పెంచుకుంటూ పోతుంది.

కాగా సోషల్ మీడియాలో తనలోని ఒంపుసొంపుల ప్రదర్శనను పరిపూర్ణంగా ప్రదర్శిస్తూ దూసుకుపోతూ ఛాన్స్ లను అందుకుంటుంది కేతిక. ప్రస్తుతం వరుస సినిమా సెట్లో అడుగు పెడుతూ.. కేతిక శర్మ తెగ సంబర పడిపోతుంది. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేయాలని అమ్మడు ఆశ పడుతుంది. మరి కేతిక కోరిక తీరుతుందా ? చూడాలి.