Ketika Sharma : అందం, అద్భుతమైన అభినయం ఉన్న హీరోయిన్స్ దొరకడం చాలా కష్టం, ప్రతీ ఇండస్ట్రీ లో ఇలాంటోళ్ళు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. మన ఇండస్ట్రీ లో అయితే చాలా మంది ఉన్నారు. కొత్తగా ఈమధ్య కాలంలో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోయిన్స్ లో అలా అందం, టాలెంట్ ఉన్న అమ్మాయిల లిస్ట్ తీస్తే కేతిక శర్మ(Ketika Sharma) మొదటి స్థానం లో ఉంటుంది. ఢిల్లీ లో పుట్టిపెరిగిన ఈ అమ్మాయి ‘రొమాన్స్’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరో గా నటించిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత విడుదలైన సినిమాలన్నీ కూడా ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. కానీ అందం, టాలెంట్ ఉండడం తో అవకాశాలు రావడం మాత్రం ఆగలేదు. రీసెంట్ గానే ఆమె ‘అది దా సర్ప్రైజ్’ అనే పాట తో ఎంత పాపులర్ అయ్యిందో ఆమదారికీ తెలిసిందే.
Also Read : మరోసారి బాలయ్య తో అనిల్ రావిపూడి..మరి చిరంజీవి సినిమా పరిస్థితి ఏంటి?
ఇకపోతే లేటెస్ట్ గా ఆమె శ్రీవిష్ణు(Sree Vishnu) తో కలిసి ‘సింగిల్'(Single Movie) అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఇందులో కేతిక శర్మ తో పాటు ‘ఇవానా’ కూడా మరో హీరోయిన్ గా నటించింది. ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. చాలా కాలం నుండి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాల కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి ఈ సినిమా ఒక మంచి ఛాయస్ గా మారింది అని చెప్పొచ్చు. ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ లో కేతిక శర్మ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
‘అది దా సర్ప్రైజ్’ పాట ఎంత వైరల్ అయ్యిందో, అంతే వివాదాస్పదంగా కూడా మారింది. ఈ పాట గురించి కేతిక మాట్లాడుతూ ‘సెట్స్ లో దర్శకుడు ఏది చెప్తే అది చేయడమే నా పని. అందులో భాగంగానే ఆ పాట చేశాను. ఇక మీదట ఇలాంటి డ్యాన్స్ స్టెప్స్ ఉంటే జాగ్రత్తలు తీసుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చింది. అదే విధంగా మీరు మీ నిజ జీవితంగా సింగిల్ గానే ఉన్నారా, లేకపోతే రిలేషన్ లో ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు కేతిక శర్మ సమాధానం చెప్తూ ‘ప్రస్తుతానికి సింగిల్ గానే ఉన్నాను. రిలేషన్ షిప్ లాంటి డ్రామాల్లోకి వెళ్లాలని అనుకోవడం లేదు. నిజాయితీగా ఉండే అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నాను. అలాంటి అబ్బాయి దొరికితే కచ్చితంగా ప్రేమిస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది కేతిక శర్మ. ఇక ఆమె భవిష్యత్తులో చేయబోయే సినిమాల గురించి చెప్తూ, తెలుగు తో పాటు హిందీ, తమిళం లో కూడా పలు సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చింది.
Also Read : ఓటీటీ లోకి వచ్చేసిన తమన్నా ‘ఓదెల 2’..ఎందులో చూడాలంటే!