https://oktelugu.com/

Keerthy Suresh: పెళ్లి తర్వాత ఇవేం పనులమ్మా కీర్తి..పబ్లిక్ లో ఎవరైనా ఇలా వస్తారా? మండిపడుతున్న కీర్తి సురేష్ ఫ్యాన్స్!

'మహానటి' సావిత్రిగా అద్భుతమైన నటన కనబర్చి నేషనల్ అవార్డుని కూడా అందుకుంది. అప్పటి నుండి గ్లామర్ రోల్స్ కి దూరంగా కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 19, 2024 / 07:34 PM IST

    Keerthy Suresh(1)

    Follow us on

    Keerthy Suresh: సౌత్ ఇండియాలో అందం పరంగా కానీ, నటన పరంగా కానీ అద్భుతంగా రాణించి అవార్డులు, రివార్డులు అందుకున్న హీరోయిన్లు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఆ తక్కువమందిలో ఒకరు కీర్తి సురేష్. ఈమె తల్లి మేనకా కూడా ఒకప్పుడు సినీ హీరోయినే. మలయాళం లో పెద్ద సూపర్ స్టార్. కీర్తి సురేష్ తండ్రి కూడా ఒక డైరెక్టర్. అమ్మానాన్నలు ఇద్దరు సినీ ఇండస్ట్రీ కి చెందినవాళ్లు కావడంతో కీర్తి సురేష్ బాల్యం నుండే నటించడం మొదలు పెట్టింది. బాలనటిగా పలు మలయాళం సినిమాల్లో నటించిన ఈమె, ఆ తర్వాత హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చి నేడు ఈ స్థానం వరకు వచ్చింది. ‘మహానటి’ సావిత్రిగా అద్భుతమైన నటన కనబర్చి నేషనల్ అవార్డుని కూడా అందుకుంది. అప్పటి నుండి గ్లామర్ రోల్స్ కి దూరంగా కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చింది.

    ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈమె తన బాల్య స్నేహితుడు ఆంటోని ని వివాహం చేసుకుంది. ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. చూడముచ్చటగా జంట ఉందంటూ కామెంట్స్ కూడా చేశారు. అయితే ఇప్పుడు ఈమె వివాదాల్లోకి చిక్కుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే బాలీవుడ్ లో ఈమె ‘బేబీ జాన్’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది. కోలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘తేరి’ చిత్రానికి ఇది రీమేక్. వరుణ్ ధావన్ హీరో గా నటించిన ఈ సినిమా, క్రిస్మస్ కానుకగా ఈ నెల 25 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో కీర్తి సురేష్ చాలా చురుగ్గా పాల్గొంటుంది. అందులో భాగంగా ఆమె ధరించిన దుస్తులు ఇప్పుడు నేషనల్ లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది.

    తన శరీరాన్ని పూర్తిగా ఎక్స్పోజ్ చేస్తూ ఎరుపు రంగు దుస్తులు ధరించిన ఈమె, మేడలో మంగళసూత్రం తో దర్శనమించింది. ఇది చూడగానే ఈమె ఏంటి ఇలా వచ్చింది. మోడరన్ డ్రెస్ లో ఇలా ఒక అమ్మాయి రావడం ఇప్పటి వరకు మేము ఎవ్వరూ చూడలేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి దుస్తులు వేసుకొచ్చినప్పుడు మంగళ సూత్రంని అలా అగౌరవపర్చకుండా,పైన ఏమైనా కప్పుకొని వచ్చునంటే బాగుండేది అని, చూసే ప్రేక్షకులకు ఇలా చేస్తే నచ్చదు అంటూ ఆమె అభిమానులు సైతం సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై ఆమె స్పందిస్తుందా లేదా అనేది చూడాలి. ఇది ఇలా ఉండగా కీర్తి సురేష్ కి ‘బేబీ జాన్’ బాలీవుడ్ లో మొట్టమొదటి సినిమా. కానీ రీమేక్ సినిమా అవ్వడం తో ఈ చిత్రం కూడా ఫ్లాప్ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ట్రైలర్ కి కూడా ఆడియన్స్ నుండి అంతంత మాత్రం గానే రెస్పాన్స్ వచ్చింది.