Bigg boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిఖిల్ పేరు ప్రకటించడం పై సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రన్నర్ గా నిల్చిన గౌతమ్ ఫ్యాన్స్, మా అభిమాన కంటెస్టెంట్ కి బిగ్ బాస్ టీం అన్యాయం చేసింది, నిఖిల్ స్టార్ మా ఛానల్ కి సంబంధించిన వాడు కాబట్టి, అతన్ని విన్నర్ ని చేసారంటూ గౌతమ్ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేసారు. అభిమానులు ఇలాంటి ఆరోపణలు చేయడం సహజమే. కానీ బిగ్ బాస్ షో కి రెండు సార్లు వెళ్లి, రెండుసార్లు రన్నర్ గా నిల్చిన అఖిల్ సార్థక్ వంటి వాళ్ళు కూడా నిఖిల్ పై కామెంట్స్ చేయడం ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. అఖిల్ మాట్లాడుతూ ‘నాకు గౌతమ్ గెలవాలని ఉంది. కానీ నా మనసు ఎందుకో నిఖిల్ పేరు చెప్తుంది. నిఖిల్ స్టార్ మా ఛానల్ కి చెందిన వాడు కాబట్టి, అతన్ని విన్నర్ ని చేసేందుకు ప్రణాళికలు బిగ్ బాస్ టీం సిద్ధం చేసినట్టుగా నాకు సమాచారం అందింది’ అని అన్నాడు.
అఖిల్ ఈ మాట బిగ్ బాస్ సీజన్ మరో మూడు వారాల్లో ముగుస్తుంది అనగా అన్నాడు. దీనిపై నిఖిల్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ ప్రస్తావించగా, దానికి సమాధానం ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘అఖిల్ రెండు సార్లు బిగ్ బాస్ కి వెళ్ళాడు. రెండు సార్లు రన్నరప్ గా నిలిచాడు. ఆయన వెళ్లిన ఆ రెండు సీజన్స్ లో టైటిల్ విన్నర్స్ గా ఎవరు నిలిచారు?, అభిజిత్, బిందు మాధవి స్టార్ మా సీరియల్స్ లో పని చేసినవాళ్లు కాదు కదా. బిగ్ బాస్ అన్ని సీజన్స్ ని తీసుకుంటే శివ బాలాజీ, కౌశల్, రాహుల్, సన్నీ, పల్లవి ప్రశాంత్, రేవంత్ వీళ్ళందరికీ స్టార్ మా తో సంబంధం లేదు. అయినా కూడా గెలిచారు కదా’ అని ఘాటుగా స్పందించాడు నిఖిల్.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఎదో నా మీద కామెంట్స్ చెయ్యాలనే చేస్తారు తప్ప. నేను ఇలాంటివి అసలు పట్టించుకోను. నేను బయట ఎలా ఉన్నానో, హౌస్ లోపల కూడా అలాగే ఉన్నాను. మొదటి రెండు వారాలు హౌస్ లో వాతావరణం ని అలవాటు చేసుకోవడం నాకు చాలా కష్టం గా అనిపించింది. వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నన్ను నాలాగా ఆడియన్స్ ఇష్టపడి ఓట్లు వేసి సేవ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు సేవ్ చేసేవరకు నేను హౌస్ లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను. ఆడియన్స్ నన్ను నచ్చి గెలిపించారు. నా వరకు నేను కష్టపడి ఆది గెలుచుకున్నా, మిగతా వాళ్ళు ఎలా అనుకున్నా నాకు ఫరక్ పడదు’ అని చెప్పుకొచ్చాడు నిఖిల్. దీనికి అఖిల్ నుండి కౌంటర్ వస్తుందా లేదా అనేది చూడాలి.