Keerthy Suresh : తన అందంతో పాటు అద్భుతమైన అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించి నేషనల్ అవార్డుని అందుకున్న హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh). ఈమె బాలనటిగా ఎన్నో మలయాళం సినిమాల్లో నటించి, అక్కడే హీరోయిన్ గా కూడా మారింది, కానీ తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది మాత్రం ‘నేను శైలజ’ చిత్రంతోనే. తొలిసినిమానే సూపర్ హిట్ అవ్వడంతో ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చూస్తూ ఉండగానే ఉన్నత స్థాయికి వెళ్ళిపోయింది. అయితే ఈమధ్య కాలంలో కీర్తి సురేష్ చేసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచాయి. పెళ్లి కి ముందు చేసిన బాలీవుడ్ ‘బేబీ జాన్’ చిత్రం పెళ్లి తర్వాత విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆమె స్క్రిప్ట్ ఎంపిక విషయం లో ఆచి తూచి అడుగులు వేయాలని నిర్ణయించుకుంది.
Also Read : హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న మధుబాల కూతురు.. లేటెస్ట్ స్టన్నింగ్ ఫోటోలు వైరల్..
అందులో భాగంగా ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా గొప్పగా ప్లాన్ చేసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరు సినిమాల్లో హీరోయిన్ గా నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో సూర్య మొట్టమొదటి తెలుగు చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక కావడం విశేషం. వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అదే విధంగా నితిన్, బలగం వేణు, దిల్ రాజు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ‘ఎల్లమ్మ’ చిత్రం లో కూడా హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట కీర్తి సురేష్. ఈ రెండు సినిమాలు కూడా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలే అవ్వడం విశేషం. ఇక ఆమె ఒప్పుకున్న మూడవ చిత్రం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తునం ‘రౌడీ జనార్ధన్’.
దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది లోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక నాల్గవ చిత్రం మలయాళం లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టొవినో థామస్ తో ఒక సినిమా కమిట్ అయ్యినట్టు తెలుస్తుంది. చాలా కాలం తర్వాత కీర్తి సురేష్ చేస్తున్న మలయాళం చిత్రమిది. ఇవి కాకుండా మరో రెండు తమిళ సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇవి కాకుండా రెండు తమిళ చిత్రాల్లో ప్రస్తుతం ఆమె నటిస్తుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలు, ఈ ఏడాదిలోనే విడుదల కాబోతుంది. అదే విధంగా నెట్ ఫ్లిక్స్ లో ఈమె ‘అక్కా’ అనే వెబ్ సిరీస్ చేసింది. ఇందులో రాధికా ఆప్టే కూడా మరో ముఖ్య పాత్ర పోషించింది. ఈ వెబ్ సిరీస్ కూడా ఈ ఏడాదిలోనే మన ముందుకు రానుంది. ఇలా వరుస సినిమాలతో కొత్తగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోయిన్స్ ఆఫర్స్ కి కూడా గండి కొడుతోంది కీర్తి సురేష్.
Also Read : శేఖర్ మాస్టర్ పై అనసూయ ఫైర్..కంట్రోల్ లో ఉండు అంటూ వార్నింగ్!