Madhubala Daughter: రోజా సినిమాతో హీరోయిన్ మధుబాలకు నటిగా బాగా గుర్తింపు వచ్చింది. ఇప్పటికి కూడా ఈమెకు చాలామంది అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు మధుబాల ఇద్దరు కూతుర్లు కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. హీరోయిన్ మధుబాల గురించి ఆమె అందం గురించి ప్రత్యేకంగా వర్ణించాల్సిన అవసరం లేదు. అందం కు మించిన అభినయంతో 90వ దశకంలో ఒక వెలుగు వెలిగిన టాప్ హీరోయిన్లలో మధుబాల కూడా ఒకరు. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వం వహించిన రోజా సినిమాతో అప్పటి యూత్ కు కలల రాణిగా మారిపోయింది. తెలుగుతోపాటు మధుబాల హిందీ, తమిళ్, మలయాళం మరియు కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. తెలుగులో మధుబాల అల్లరి ప్రియుడు, ఆవేశం, గణేష్, జెంటిల్మెన్, చిలక్కొట్టుడు ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.
Also Read: చైల్డ్ ఆర్టిస్ట్ గా 24 సినిమాలతో ఫుల్ క్రేజ్.. ప్రస్తుతం హీరోయిన్ గా హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్..
అయితే మధుబాల కెరియర్ బాగా ఫామ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. మధుబాల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హేమమాలిని, జుహీ చావ్లా కు బాగా దగ్గరి బంధువు అయినా బిజినెస్ మాన్ ఆనంద్ షా ను ఫిబ్రవరి 19, 1999లో పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఆమెయ్యా,కేయ అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెళ్లి తర్వాత మధుబాల సినిమాలకు దూరంగా ఉంటుంది. చాలాకాలం గ్యాప్ తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.ప్రస్తుతం సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సూర్య వర్సెస్ సూర్య, ప్రేమదేశం,ఈగల్, శకుంతలం వంటి తదితర సినిమాలలో కీలక పాత్రలలో నటించింది మధుబాల. ప్రస్తుతం ఈమె మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తుంది అంటే సామాజిక మాధ్యమాలలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకప్పటి సీనియర్ హీరోయిన్ మధుబాలకు ఇద్దరూ అందమైన కూతుర్లు ఉన్నారు. వాళ్ల పేర్లు కీయ షా, ఆమెయ షా. ఇద్దరు కూతుళ్లు కూడా తల్లికి మించిన అందంతో చాలా అందంగా ఉన్నారు. మధుబాల ఇద్దరు కూతుళ్లకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే వీళ్ళిద్దరిలో కియా షా త్వరలో సినిమాలలోకి ఎంట్రీ ఇస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే వర్కు కూడా జరుగుతుందని సమాచారం. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ మధుబాల కూతురు కీయ షా లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram