https://oktelugu.com/

Keerthy Suresh: ఆ స్టార్ హీరోకి లిప్ కిస్ ఇవ్వలేనన్న కీర్తి సురేష్… చివరికి ఏం చేసిందంటే?

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అజ్ఞాతవాసి మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అయితే అజ్ఞాతవాసి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే మహానటి మూవీతో కీర్తి సురేష్ భారీ విజయం సొంతం చేసుకుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : February 17, 2024 / 12:19 PM IST
    Follow us on

    Keerthy Suresh: చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన మలయాళ కుట్టి కీర్తి సురేష్… హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె మొదటి చిత్రం నేను శైలజ. రామ్ పోతినేని నటించిన ఈ చిత్రం రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. నేను శైలజ సూపర్ హిట్ కావడంతో కీర్తికి టాలీవుడ్ లో ఆఫర్స్ మొదలయ్యాయి. నానికి జంటగా నేను లోకల్ మూవీ చేసింది. ఇది కూడా హిట్. దాంతో ఏకంగా పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ కొట్టేసింది.

    దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అజ్ఞాతవాసి మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అయితే అజ్ఞాతవాసి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే మహానటి మూవీతో కీర్తి సురేష్ భారీ విజయం సొంతం చేసుకుంది. సావిత్రి బయోపిక్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. సావిత్రిగా జీవించిన కీర్తి సురేష్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

    స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న కీర్తి సురేష్ కి ఆఫర్స్ క్యూ కట్టాయి. టాప్ స్టార్స్ తో కూడా ఆమె నటిస్తున్నారు. హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ నుండి బయటపడాలని చూస్తున్న అమ్మడు గ్లామర్ రోల్స్ కూడా చేస్తుంది. మహేష్ బాబుకు జంటగా నటించిన సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ నెగిటివ్ షేడ్స్ తో కూడిన పాత్ర చేయడం విశేషం. గత చిత్రాలతో పోల్చితే సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ బోల్డ్ గా కనిపించింది.

    అయితే టాలీవుడ్ కి ఎంటర్ అయిన కొత్తల్లో ఆమె స్టార్ హీరో మూవీని రిజెక్ట్ చేసిందట. అందుకు కారణం… ఆ మూవీలో లిప్ లాక్ సన్నివేశం ఉండటమేనట. ఆ చిత్ర హీరో నితిన్ కాగా లిప్ లాక్ సన్నివేశం చేయనంటూ సినిమా ఆఫర్ వదులుకుందట. నితిన్ అప్పుడు హిట్స్ తో ఫార్మ్ లో ఉన్నాడు. కీర్తి సురేష్ తెలుగులో అప్పుడప్పుడే ఎదుగుతుంది. కాగా వీరిద్దరూ అనంతరం రంగ్ దే మూవీలో జతకట్టారు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పర్లేదు అనిపించుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది.