https://oktelugu.com/

Subhashree: సీక్రెట్ లవ్ బయటపెట్టిన శుభశ్రీ.. ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ తో వాలెంటైన్స్ డే సెలెబ్రేషన్స్

తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ స్పెషల్ వీడియో తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసింది. శుభశ్రీ... గౌతమ్ ఓ చోటకు తీసుకెళ్లింది. గౌతమ్ కళ్ళు మూసి అందంగా డెకరేట్ చేసిన రూమ్ లోకి తీసుకెళ్లి సర్ప్రైజ్ చేసింది.

Written By:
  • S Reddy
  • , Updated On : February 17, 2024 / 12:26 PM IST
    Follow us on

    బిగ్ బాస్ తెలుగు 7 లో పాల్గొన్న నటి శుభశ్రీ రాయగురు వెలుగులోకి వచ్చింది. హౌస్ లో ఉన్నది తక్కువ రోజులే అయినా ఒక్క డైలాగ్ తో పాపులర్ అయింది. మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ శుభశ్రీ అన్న మాటలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. బయటకు వచ్చిన తర్వాత శుభశ్రీ… ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. తన తోటి కంటెస్టెంట్స్ తో కలిసి రీల్స్, వీడియోలు చేసి షేర్ చేస్తుంది.

    తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ స్పెషల్ వీడియో తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసింది. శుభశ్రీ… గౌతమ్ ఓ చోటకు తీసుకెళ్లింది. గౌతమ్ కళ్ళు మూసి అందంగా డెకరేట్ చేసిన రూమ్ లోకి తీసుకెళ్లి సర్ప్రైజ్ చేసింది. అనంతరం ఇద్దరు సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు. బిగ్ బాస్ లో జరిగిన సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకున్నారు. వాళ్ళ మధ్య జరిగిన క్యూట్ మూమెంట్స్ స్క్రీన్ పై చూస్తూ ఆనందంలో తేలిపోయారు.

    ఇక చివర్లో గౌతమ్ శుభశ్రీ వేలికి రింగ్ తొడిగి ప్రపోజ్ చేశాడు. శుభశ్రీ తెగ నవ్వుతూ సిగ్గు పడింది. అయితే గౌతమ్ ఇందంతా శుభ శ్రీ అడగం వలన చేశాడు. అది నిజమైన ప్రపోజల్ కాదు. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి గతంలో ఎలా ప్రపోజ్ చేశావు, ఏమని చెప్పావో .. అలాగే నాకిప్పుడు చెప్పు అని శుభశ్రీ… గౌతమ్ ని అడిగింది. దీంతో… నీకు నేను జీవితాంతం కష్టంలో, సుఖంలో తోడుగా ఉంటానంటూ గౌతమ్ ప్రపోజ్ చేశాడు.తర్వాత కేక్ కట్ చేసి పార్టీ ఎండ్ చేశారు.

    కాగా హౌస్ లో ఉన్నప్పుడు గౌతమ్, శుభశ్రీ వెంటే తిరిగేవాడు. శుభ శ్రీ కూడా అతనితో క్లోజ్ గా ఉండేది. వీళ్ళ మధ్య లవ్ ట్రాక్ కూడా నడిచింది. బయటకు వచ్చాక కూడా ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో వాళ్ళు రియల్ గా లవ్ చేసుకుంటున్నారు అని నెటిజన్స్ భావిస్తున్నారు. గౌతమ్-శుభశ్రీ జంట చాలా క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి వాళ్ళు నిజంగా ప్రేమించుకుంటున్నారా లేదా తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.