hero Sri Simha : ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు, ‘మత్తు వదలరా’ సిరీస్ హీరో శ్రీ సింహా పెళ్లి నిన్న రాత్రి UAE లో బందు మిత్రుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. సీనియర్ హీరో మురళి మోహన్ మానవరాలితో గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్న శ్రీ సింహా, ఇటీవలే ఈ విషయాన్నీ ఇంట్లో చెప్పగా, ఇరువురి కుటుంబాలు ఒప్పుకొని ఈ వివాహాన్ని తెర పైకి తీసుకొచ్చారు. శ్రీ సింహా కి ఇండస్ట్రీ లో సన్నిహితంగా ఉన్న కొంతమంది ఆర్టిస్ట్స్ ఈ పెళ్లి కి హాజరు కాగా, రాజమౌళి కుటుంబం కూడా పాల్గొన్నది. అయితే శ్రీ సింహా కి చిన్నతనం నుండి ఎంతో క్లోజ్ గా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి వాళ్ళు ఈ వివాహానికి రాకపోవడం గమనార్హం. వీళ్లంతా ప్రస్తుతం ఇండియా లో ఎవరి షూటింగ్ లో వాళ్ళు బిజీ గా ఉన్నారు. అందుకే హాజరు కాలేకపోయారని తెలుస్తుంది.
ఇక శ్రీ సింహా విషయానికి వస్తే ఇతను కీరవాణి కొడుకుగా, బాలనటుడిగా పలు సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం ‘యమదొంగ’ లో ఎన్టీఆర్ చిన్నప్పటి క్యారక్టర్ ని చేసింది శ్రీ సింహా నే. ఆ తర్వాత విద్యాబ్యాసం మీద ద్రుష్టి పెట్టిన ఆయన, చదువు పూర్తి చేసుకున్న తర్వాత ‘మత్తు వదలరా’ అనే చిత్రంతో హీరో గా వెండితెర అరంగేట్రం చేసాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తొలిసినిమా తోనే శ్రీ సింహా లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా మంచి మార్కులు కొట్టేసాడు. ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకున్నారు కానీ. ‘మత్తు వదలరా’ తర్వాత ఈయన చేసిన ‘తెల్లవారితే గురువారం’, ‘దొంగలున్నారు జాగ్రత్త’, ‘భాగ్ సాలే’, ‘ఉస్తాద్’ వంటి చిత్రాలు చేయగా, అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద ఒక దాని తర్వాత ఒకటి ప్లాప్ అవుతూ వచ్చాయి.
ఇలా వరుస ఫ్లాప్స్ తర్వాత ఆయన ఈ ఏడాది చేసిన ‘మత్తు వదలరా 2’ చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ లో కూడా దాదాపుగా రెండు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. థియేట్రికల్ రిలీజ్ కంటే ఎక్కువగా, ఓటీటీ లో విడుదలైనప్పుడు ఈ చిత్రానికి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రియా మదర్ ఎవరు అనే డైలాగ్ పై ఎన్ని మీమ్స్ వచ్చాయో మన అందరికీ తెలిసిందే. యూత్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని తెగ ఎంజాయ్ చేసారు. అయితే ఈ చిత్రంలో శ్రీ సింహా కంటే ఎక్కువ కమెడియన్ సత్య కి పేరొచ్చింది.
Koduri and Maganti families come together for grand wedding celebrations of #SimhaKoduri and #RaagaMaganti in the UAE.#SSRajamouli #MuraliMohan pic.twitter.com/tDk7TxIxg6
— Gulte (@GulteOfficial) December 14, 2024