https://oktelugu.com/

Bigg Boss Voice : బిగ్ బాస్’ కి వాయిస్ ఇచ్చిన వ్యక్తి ఆ స్టార్ హీరోకి ఇన్నేళ్లు దుబ్బింగ్ చెప్పాడా..? ఇన్ని రోజులు తెలియలేదుగా!

ఈ చిత్రంలో కూడా శివరాజ్ కుమార్ క్యారక్టర్ కి ఈయనే డబ్బింగ్ అందిస్తున్నాడు. రెమ్యూనరేషన్ కూడా ఈయనకి భారీ రేంజ్ లోనే ఉంటుందట. కానీ బిగ్ బాస్ నడిచే మూడు నెలల సమయంలో

Written By:
  • NARESH
  • , Updated On : December 15, 2024 / 09:33 AM IST
    Follow us on

    Bigg Boss Voice తెలుగు ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే ఎంటర్టైన్మెంట్ షోస్ లో ఒకటి బిగ్ బాస్ రియాలిటీ షోస్. ఇతర దేశాల్లో ఎప్పటి నుండి పాపులర్ అయిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోని హిందీ లో ముందుగా సల్మాన్ ఖాన్ ని హోస్ట్ గా పెట్టి ప్రారంభించారు. అక్కడ అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో, మిగిలిన అన్ని ప్రాతీయ భాషల్లో మొదలు పెట్టారు. అన్నిట్లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది కానీ, తెలుగు బిగ్ బాస్ కి మరింత ఎక్కువ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఈ రియాలిటీ షో కి మొదటి సీజన్ నుండి ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ కి డబ్బింగ్ చెప్తూ వచ్చిన ఆర్టిస్ట్ రాధా కృష్ణ. ఈయన గొంతు లోని గాంభీర్యం, స్పష్టమైన తెలుగు ఉచ్చారణ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకోవడంతో 8 సీజన్స్ కి ఆయనే పని చేసాడు.

    ఈయన గతంలో ఎన్నో వందల మంది ఆర్టిస్టులకు డబ్బింగ్ చెప్పుకుంటూ వచ్చాడు. హిందీ, తమిళం, తెలుగు ఇలా ఒక్కటా రెండా, రెండు దశాబ్దాల నుండి ఆయన సినీ ఇండస్ట్రీ లో ఇలా కొనసాగుతూనే ఉన్నాడు. పాపులర్ క్రైమ్ థ్రిల్లర్ సీరియల్ CID హిందీ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సీరియల్ లో ACP ప్రత్యూమన్ క్యారక్టర్ కి తెలుగు, హిందీ భాషల్లో డబ్బింగ్ చెప్పింది మరెవరో కాదు, ఈయనే. అలాగే ముకేశ్ రుషి, ప్రదీప్ రావత్ వంటి పాపులర్ విలన్స్ కి కూడా ఈయన తెలుగు లో డబ్బింగ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ‘కన్నప్ప’ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ క్యారక్టర్ కి డబ్బింగ్ ని అందిస్తున్నాడు. శివ రాజ్ కుమార్ ఈ చిత్రంతో పాటు రామ్ చరణ్, బుచ్చి బాబు సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

    ఈ చిత్రంలో కూడా శివరాజ్ కుమార్ క్యారక్టర్ కి ఈయనే డబ్బింగ్ అందిస్తున్నాడు. రెమ్యూనరేషన్ కూడా ఈయనకి భారీ రేంజ్ లోనే ఉంటుందట. కానీ బిగ్ బాస్ నడిచే మూడు నెలల సమయంలో మాత్రం ఆయన ఏ చిత్రానికి కానీ, సీరియల్ కి కానీ డబ్బింగ్ చెప్పడట. ఎందుకంటే మూడు నెలల పాటు ఆయన అన్నపూర్ణ స్టూడియోలో వేసిన బిగ్ బాస్ సెట్స్ లోనే ఉండాలి. ఏ క్షణంలో అయినా హౌస్ మేట్స్ తో మాట్లాడే అవసరం ఉంటుంది కాబట్టే బిగ్ బాస్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. మూడు నెలల పాటు ఆయన సెట్స్ లోనే ఉంటాడు కాబట్టి బిగ్ బాస్ టీం ఆయనకీ కోటి రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ ఇస్తుందని సమాచారం. ఇది ఇలా ఉండగా ఈ సీజన్ కి సంబంధించిన గ్రాండ్ ఫినాలే నేడు సాయంత్రం నుండి టెలికాస్ట్ కాబోతున్న సంగతి తెలిసిందే.