https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : నబీల్ కి రామ్ చరణ్ బంపర్ ఆఫర్.. ఏ కంటెస్టెంట్ కి దక్కని అదృష్టం..మొత్తానికి కల నెలవేరిందిగా!

ఒక రోల్ ని ఆఫర్ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. గత సీజన్ లో కూడా అమర్ దీప్ కి రవితేజ తన సినిమాలో నటించే అవకాశం ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నబీల్ కి అలాంటి అవకాశం దక్కింది.

Written By:
  • NARESH
  • , Updated On : December 15, 2024 / 08:48 AM IST
    Follow us on

    Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ ఎట్టకేలకు చివరి రోజుకి చేరుకుంది. రేపు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ రాత్రి 7 గంటల నుండి ప్రసారం కానుంది. నిన్నటి ఎపిసోడ్ చివర్లో గ్రాండ్ ఫినాలే కి సంబంధించిన ప్రోమో ని వేయడం మీరంతా చూసే ఉంటారు. ఉపేంద్ర వంటి సెలబ్రిటీస్ అతిథులుగా విచ్చేసారు. నిన్న ఫినాలే కి సంబంధించి కొంత వరకు షూటింగ్ ని పూర్తి చేసారు. హౌస్ నుండి అవినాష్ 5వ స్థానంలో ఎలిమినేట్ అవ్వగా, ప్రేరణ నాల్గవ స్థానంలో ఎలిమినేట్ అయ్యింది. టాప్ 4 కంటెస్టెంట్స్ హౌస్ లో మిగిలినప్పుడు బిగ్ బాస్ సూట్ కేసు ని ఆఫర్ చేశారట. కానీ ఎవ్వరూ తీసుకోలేదు. ప్రేరణ ఆ సూట్ కేసు ని తీసుకొని ఉండుంటే బాగుండేది అని ఆమె అభిమానులు బాధపడుతున్నారు. ఎందుకంటే ప్రేరణ ఆడిన ఆట తీరుకి ఆమె ఆ సూట్ కేసు ని తీసుకునేందుకు అర్హురాలు అని చెప్పొచ్చు.

    ఇప్పుడు హౌస్ లో ముగ్గురు మిగిలారు, వీరిలో ఎవరు టైటిల్ గెలవబోతున్నారు అనేది ప్రస్తుతానికి పెద్ద సస్పెన్స్. సోషల్ మీడియా లో జరిగిన పొలింగ్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకుంటే నిఖిల్, గౌతమ్ వీళ్ళిద్దరిలో ఒక్కరే టైటిల్ కొట్టబోతున్నారు అనేది మనకి అర్థమైపోయింది. అధికారిక ఓటింగ్ లో కూడా అలాగే ఉందట. మరి ఏమి జరగబోతుందో చూడాలి. అయితే ఈ ఫినాలే ఎపిసోడ్ కి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు కానీ, విష్ణు ప్రియా, నయని పావని, హరితేజ మాత్రం రాలేదట. విష్ణు ప్రియ ఇలాంటి సందర్భాల్లో మంచి టీఆర్ఫీ కంటెంట్ ఇస్తుంది. ఆమె లేని ఇలాంటి ఈవెంట్స్ ని ఊహించుకోలేము, మరి ఏ కారణం చేతనో ఆమె ఫినాలే లో పాల్గొనలేకపోయింది. ఆమె సంగతి కాసేపు పక్కన పెడితే, ఫినాలే కి ముఖ్య అతిథి గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నాడు.

    ఆయన చేతుల మీదుగానే గౌతమ్ లేదా నిఖిల్ కప్పుని అందుకోబోతున్నారు. రామ్ చరణ్ కంటెస్టెంట్స్ అందరితో ముచ్చటించారట. గౌతమ్ రామ్ చరణ్ కి పెద్ద ఫ్యాన్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. మరి తన అభిమాన హీరో చేతుల మీదుగా కప్పుని అందుకుంటాడో లేదో చూడాలి. అంతే కాదు రామ్ చరణ్ కి నబీల్ చాలా బాగా నచ్చాడట. అతని మాట తీరు, మ్యానరిజమ్స్ ఆయన్ని చాలా బాగా ఆకట్టుకుందట. కామెడీ టైమింగ్ కూడా బాగా నచ్చింది అని బిగ్ బాస్ టీం తో అన్నాడట. సినీ నటుడు అవ్వాలి అనే కోరిక తో ఉన్నటువంటి నబీల్ కి రామ్ చరణ్ తన సినిమాలో ఒక రోల్ ని ఆఫర్ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. గత సీజన్ లో కూడా అమర్ దీప్ కి రవితేజ తన సినిమాలో నటించే అవకాశం ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నబీల్ కి అలాంటి అవకాశం దక్కింది.