https://oktelugu.com/

young heroine : సినిమా సూపర్ హిట్ అవ్వడం కోసం అన్నం తినడం మానేసిన యంగ్ హీరోయిన్..!

చూడాలి మరి కనీసం ఈసారైనా గోపీచంద్ హిట్ కొడతాడా లేదా?, కావ్య థాపర్ ఉపవాస దీక్షకు ఆడియన్స్ ఫలితం ఇస్తారా లేదా అనేది చూడాలి.

Written By:
  • NARESH
  • , Updated On : October 9, 2024 / 08:02 PM IST

    kavya thapar

    Follow us on

    young heroine : ఇటీవలే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కుర్ర హీరోయిన్స్ లో ఒకరు కావ్య థాపర్. ఈ అమ్మాయి ‘ఈ మాయ పేరేమిటో’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు, ఆ తర్వాత తమిళం లో ఒక సినిమా చేసింది, ఆ సినిమా కూడా అనుకున్న రేంజ్ లో ఆడలేదు. కానీ ఈమెకు అందం, టాలెంట్ ఉండడం తో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అలా ఈమెకు టాలీవుడ్ లో ‘ఏక్ మినీ కథ’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అయ్యింది, ఓటీటీ లో కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుసగా హీరోయిన్ రోల్స్ వచ్చాయి కానీ ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు. సందీప్ కిషన్ తో ఈమె చేసిన ‘ఊరి పేరు భైరవకోన’ చిత్రం కమర్షియల్ గా యావరేజ్ గా నిల్చింది.

    ఆ చిత్రం తర్వాత ఈమె చేసిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇప్పుడు రీసెంట్ గా ఈమె గోపీచంద్ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో ‘విశ్వం’ అనే చిత్రం చేసింది. ఈ సినిమా అక్టోబర్ 11 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవుతుంది. ఈ సినిమా మీద ఈమె బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఈ చిత్రం తర్వాత ఆమె చేతిలో పాపం ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. కమర్షియల్ గా ‘విశ్వం’ చిత్రం పెద్ద హిట్ అవ్వడం కావ్య థాపర్ కెరీర్ కి కచ్చితంగా అవసరం. అందుకే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం కోసం నవరాత్రి ఉపవాస దీక్షకు పూనుకుంది. ఆమె జీవితంలో మొట్టమొదటిసారి నవరాత్రి సందర్భంగా ఉపవాసం చేస్తుందట. దీనిని బట్టి ఈ సినిమా ఆమెకు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం లో ఆమె క్యారక్టర్ ఆడియన్స్ కి తెగ నచ్చేస్తుంది అనే బలమైన నమ్మకం తో ఉంది కావ్య.

    మరి ఆమె ఉపవాస దీక్ష ఫలితం ఈ సినిమాకి లభిస్తుందో లేదు చూడాలి. మరో పక్క ఈ చిత్రం ట్రైలర్ చూస్తుంటే పాపం కావ్య థాపర్ కోరిక నెరవేరేలా అనిపించడం లేదు. చాలా రొటీన్ గా శ్రీను వైట్ల మార్క్ తో తీసినట్టుగా అనిపించింది. కానీ శ్రీను వైట్ల మార్కు సినిమాలు ఇప్పుడు ఆడియన్స్ కి అసలు నచ్చడం లేదు. అందుకే ఆయన రీసెంట్ సినిమాలు ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. మరోపక్క గోపీచంద్ మార్కెట్ కూడా పూర్తిగా పడిపోయింది. కనీస స్థాయి ఓపెనింగ్స్ ని కూడా తెచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. చూడాలి మరి కనీసం ఈసారైనా గోపీచంద్ హిట్ కొడతాడా లేదా?, కావ్య థాపర్ ఉపవాస దీక్షకు ఆడియన్స్ ఫలితం ఇస్తారా లేదా అనేది చూడాలి.