https://oktelugu.com/

Kartikeya 2 Collections: 100 కోట్ల క్లబ్ లో ‘కార్తికేయ 2’.. షేక్ అవుతున్న బాలీవుడ్ స్టార్స్.. ఎన్ని కోట్లు లభామో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Kartikeya 2 Collections: ‘కార్తికేయ 2′ ఇప్పుడు ఒక సంచలనం. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కార్తికేయ 2 బాక్సాఫీస్ దగ్గర షేకింగ్ కలెక్షన్స్ ను రాబడుతోంది. మొత్తానికి పాన్ ఇండియాని నిఖిల్ షేక్ చేస్తున్నాడు. ‘చందు మొండేటి’ డైరెక్షన్ లో నిఖిల్ హీరోగా వచ్చిన మొత్తమ్మీద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్‌ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇలా సందడి చేయడం సినీ ప్రముఖులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. […]

Written By:
  • Shiva
  • , Updated On : August 23, 2022 / 12:53 PM IST
    Follow us on

    Kartikeya 2 Collections: ‘కార్తికేయ 2′ ఇప్పుడు ఒక సంచలనం. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కార్తికేయ 2 బాక్సాఫీస్ దగ్గర షేకింగ్ కలెక్షన్స్ ను రాబడుతోంది. మొత్తానికి పాన్ ఇండియాని నిఖిల్ షేక్ చేస్తున్నాడు. ‘చందు మొండేటి’ డైరెక్షన్ లో నిఖిల్ హీరోగా వచ్చిన మొత్తమ్మీద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్‌ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇలా సందడి చేయడం సినీ ప్రముఖులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సినిమాలో నిఖిల్ చేసిన విన్యాసాలు.. అలాగే బెస్ట్ విజువల్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. మరీ బాక్సాఫీస్ వద్ద ‘కార్తికేయ 2’ సక్సెస్ ఏ స్థాయిలో ఉంది ?, అసలు ఈ సినిమా కలెక్షన్స్ పరిస్థితి ఏమిటి ?, ఇంతకీ నిర్మాతకు ఏ రేంజ్ లో లాభాలు వచ్చాయో ? చూద్దాం రండి.

    nikhil

    ముందుగా ‘కార్తికేయ 2’ సినిమా 12 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం. నైజాం 16.84 కోట్లు, సీడెడ్ 13.06 కోట్లు, ఉత్తరాంధ్ర 12.54 కోట్లు, ఈస్ట్ 1.64 కోట్లు, వెస్ట్ 1.09 కోట్లు, గుంటూరు 1.76 కోట్లు, కృష్ణా 1.49 కోట్లు, నెల్లూరు 0.94 కోట్లు వచ్చాయి. మొత్తానికి ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 12 డేస్ కలెక్షన్స్ కు గానూ ‘కార్తికేయ 2’ రూ. 19.47 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 69.04 కోట్లు వచ్చాయి.

    Also Read: Thaman- Godfather Teaser: కాపీ కొట్టి అడ్డంగా బుక్ అయిన తమన్.. సంచలన నిర్ణయం తీసుకున్న చిరంజీవి.. ఇప్పుడు గాడ్ ఫాదర్ పరిస్థితి ఏమిటి ?

    రెస్ట్ ఆఫ్ ఇండియా 11.72 కోట్లు

    ఓవర్సీస్ 3.10 కోట్లు

    హిందీ మరియు ఇతర వెర్షన్లు 13.07 కోట్లు

    టోటల్ వరల్డ్ వైడ్ గా 12 డేస్ కలెక్షన్స్ కు గానూ ‘కార్తికేయ 2’ రూ. 57.15 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 114:30 కోట్లను కొల్లగొట్టింది

    nikhil

    కార్తికేయ 2 చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.17.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ, 12 రోజులకే ఈ చిత్రం 57.15 కోట్లు షేర్ ను, 114:30 గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా ప్రస్తుత కలెక్షన్స్.. అలాగే బుకింగ్స్ ను బట్టి అంచనా వేస్తే… బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నట్లే. నిజానికి ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్లకు రావడం లేదు. అయితే, ‘కార్తికేయ 2’ కోసం ఫ్యామిలీస్ కూడా థియేటర్స్ దగ్గర కనిపించారు. ఆ రేంజ్ లో ఈ చిత్రం సక్సెస్ అయ్యింది. మొత్తానికి నిఖిల్ బాక్సాఫీస్ దగ్గర షేకింగ్ కలెక్షన్స్ ను రాబట్టాడు. ఈ సినిమా విజయం బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం షాక్ అవుతున్నారు. ఒక చిన్న తెలుగు హీరో 57:15 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయడం అనేది రికార్డే.

    Also Read:Salman Khan – Puri Jagannath: పూరి జగన్నాథ్ దర్శకత్వం లో సల్మాన్ ఖాన్ సినిమాకి ముహూర్తం ఫిక్స్

     

     

    Tags