https://oktelugu.com/

Thaman- Godfather Teaser: కాపీ కొట్టి అడ్డంగా బుక్ అయిన తమన్.. సంచలన నిర్ణయం తీసుకున్న చిరంజీవి.. ఇప్పుడు గాడ్ ఫాదర్ పరిస్థితి ఏమిటి ?

Thaman- Godfather Teaser: మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే, మొన్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది. టీజర్ లో మెగాస్టార్ లుక్స్, స్టయిల్ అద్భుతంగా అనిపించాయి. ముఖ్యంగా టీజర్ కంటెంట్ విషయంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ.. ఈ టీజర్ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం మెగా ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు. నిజానికి ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు […]

Written By:
  • Shiva
  • , Updated On : August 23, 2022 / 12:46 PM IST
    Follow us on

    Thaman- Godfather Teaser: మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే, మొన్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది. టీజర్ లో మెగాస్టార్ లుక్స్, స్టయిల్ అద్భుతంగా అనిపించాయి. ముఖ్యంగా టీజర్ కంటెంట్ విషయంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ.. ఈ టీజర్ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం మెగా ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు. నిజానికి ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు అని ఎనౌన్స్ చేసినప్పుడు మెగా ఫ్యాన్స్ అంతా సంబరాలు జరుపుకున్నారు. కారణం.. తమన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. కాబట్టి.. ఈ సినిమా మ్యూజిక్ విషయంలో భారీ అంచనాలను పెట్టుకోవచ్చు. కానీ, విచిత్రంగా గాడ్ ఫాదర్ టీజర్ లో బిజియం ఏమాత్రం మెప్పించలేకపోయింది.

    chiranjeevi

    పైగా ఉన్న మ్యూజిక్ కూడా కాపీ అని తెలిసే సరికి మెగా ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు. గాడ్ ఫాదర్ టీజర్ లో బిజియం గమనిస్తే వరుణ్ తేజ్ డిజాస్టర్ మూవీ గని బిజియం గుర్తుకు వస్తోంది. గుర్తుకు రావడం కాదు, సేమ్ అదే కదా అనే ఫీలింగ్ కలుగుతుంది. దాంతో తమన్ గని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని గాడ్ ఫాదర్ చిత్రానికి రిపీట్ చేశాడు అంటూ అతని పై మెగా ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తమన్ పై అభిమానులు ట్రోలింగ్ కి దిగారు. ఇన్ని జరుగుతున్నా చిరు మాత్రం తమన్ వైపే ఉన్నాడట. తమన్ ఇచ్చిన పాటలనే తీసుకోవాలని చిరు నిర్ణయించుకున్నాడట. మరి ఇప్పుడు గాడ్ ఫాదర్ పరిస్థితి ఏమిటి ? ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఏది ఏమైనా ‘సంగీత దర్శకుడు తమన్‌’ కాపీ కొట్టడం తన జన్మ హక్కుగా పెట్టుకున్నట్లు ఉన్నాడు. తెలుగు ఇండస్ట్రీలో కాపీ క్యాట్ అనగానే ముందుకు గుర్తుకొచ్చే పేరు తమన్.

    Also Read: Salman Khan – Puri Jagannath: పూరి జగన్నాథ్ దర్శకత్వం లో సల్మాన్ ఖాన్ సినిమాకి ముహూర్తం ఫిక్స్

    పాపం తమన్ ఎంతో కష్టపడి ఒక పాటను కంపోజ్ చేసి రిలీజ్ చేస్తే.. వెంటనే దీని ఒరిజినల్ పాడండ్రా అంటూ ట్రోల్ మొదలు పెడుతున్నారు నెటిజన్లు. ఇది ఒక్క గాడ్ ఫాదర్ విషయంలోనే కాదు, గతంలో ‘సర్కారు వారి పాట’లోని మ మ మహేషా సాంగ్‌ కి కూడా ఇదే జరిగింది. సరైనోడు చిత్రంలో సై సై అంటూ అంజలితో కలిసి బన్నీ ఒక స్పెషల్ సాంగ్ చేశాడు. ఈ పాట ట్యూన్‌ ని, మ మ మహేషా పాట ట్యూన్‌ ని ఒకేలా ఉన్నాయి. ఈ రెండు పాటల ట్యూన్లను తమన్ కాస్త అటు ఇటు మార్చి కొట్టారని ఆ మధ్య ట్రోలర్స్ రెచ్చిపోయారు. మళ్లీ ఇప్పుడు గాడ్ ఫాదర్ విషయంలోనూ ఇదే జరిగింది.అందుకే, ప్రస్తుతం తమన్ మళ్లీ కాపీ ఎలా కొట్టావయ్యా ? అంటూ విమర్శలు చేస్తున్నారు.

    Thaman

    ఏది ఏమైనా పెద్ద హిట్ పాటలను కూడా, కాపీ కొట్టాడనే విమర్శలు అందుకున్న ఘనత మాత్రం తమన్ దే. అయితే తన పై వస్తోన్న విమర్శలకు తమన్ ఓ రేంజ్ లో ఆన్సర్ ఇస్తూ.. ‘కాపీ ట్యూన్స్ చేస్తే మా అమ్మ నాకు అన్నం పెడుతుందా ? ‘కాపీ కొడితే.. నాకింతింత‌ పారితోషికాలు ఇస్తారా’ ‘కాపీ కొడితే.. నాకొన్ని సినిమాలు వ‌స్తాయా’ అంటూ లాజిక్కులు తీసి వివరణ ఇచ్చుకుంటుంటాడు. త‌న‌పై కాపీ ముద్ర ప‌డిన‌ప్పుడ‌ల్లా త‌మ‌న్ లాజిక్స్ ఇలాగే ఉంటాయి. కానీ ఆ తర్వాత పాట మాత్రం, కాపీ ట్యూన్ తోనే వస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తోన్న తంతంగమే ఇది.

    అయినా తమన్ మాత్రం కాపీ చేసినట్టు ఒప్పుకోడు. పైగా ‘వాళ్లకి అంత దమ్ముంటే. వచ్చి కొత్తగా ఓ పాట క్రియేట్‌ చేసి చూపించమనండి’ అంటూ ఎదురు మండిపడుతుంటాడు. ఎవడు పడితే వాడు వచ్చి కాపీ కొట్టాడంటే ఇక్కడ ఎవడూ వినేవాడు లేడు అంటూ ఫైర్ అవుతుంటాడు. మొత్తంగా త‌న పాట‌ను తానే కాపీ కొట్టుకుంటూ ఇలా బుక్ అవుతున్నాడు తమన్.

    Also Read:Vijay Deverakonda Love Proposal: విజయ్ దేవరకొండకి పబ్లిక్ గా అది తీసి పెట్టేసింది.. షాకైన ఛార్మి.. విజయ్ కూడా రెచ్చిపోయాడు.. ఇది నిజంగా షాకింగే!

     

     

    Tags